లక్ష్మీ దేవతకు నాలుగు చేతులు ఎలా ఉంటాయ్?: ఎస్పీ నేత వ్యాఖ్యలు వివాదాస్పదం

By Mahesh K  |  First Published Nov 13, 2023, 9:41 PM IST

ఈ భూప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు కళ్లు,రెండు నాసికారంధ్రాల ముక్కు ఉంటాయని, కానీ, లక్ష్మీ దేవత నాలుగు చేతులతో ఎలా పుట్టిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
 


లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. లక్ష్మీ దేవతకు నాలుగు చేతులు ఎలా ఉంటాయి అనే సందేహాన్ని వెలిబుచ్చారు. ఈ వ్యాఖ్యలకు గాను సొంత పార్టీ నుంచే అసంతృప్తి ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీని నష్టపరచడాన్ని ఆపండి అంటూ ఎస్పీ ప్రతినిధి ఐపీ సింగ్ సూచనలు చేశారు. రామచరిత మానస్, బద్రినాథ్ ఆలయాలపై ఆయన వ్యాఖ్యలు చేసి ఇది వరకే వివాదాస్పదుడయ్యాడు.

దీపావళి రోజున తాను తన సతీమణిని పూజించానని, వాస్తవానికి ఆమెనే దేవీ అని స్వామి ప్రసాద్ మౌర్య ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఈ భూ ప్రపంచం మీద ఏ జాతి, కులం, మతం,రంగు, దేశంలో పుట్టినా ప్రతి శిశువుకు రెండు చేతులు, రెండుకాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు, రెండు నాసికారంధ్రాలతో ఒక ముక్కు ఉంటుంది. అలాగే, ఒకే పొట్ట, ఒకే వీపు ఉంటాయి. ఇప్పటి వరకు ఒక పిల్లాడు నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, 20 చేతులు,  వేల చేతులతో ఇది వరకు జన్మించలేదు. మరి అలాంటప్పుడు లక్ష్మీ దేవి నాలుగు చేతులతో ఎలా జన్మించింది? అని ప్రశ్నించారు.

Latest Videos

undefined

‘ఒక వేళ మీరు లక్ష్మీ దేవతను పూజించాలని అనుకుంటే అప్పుడు మీ భార్యను గౌరవించండి, పూజించండి. దేవతకు నిజమైన అర్థం భార్యే అవుతుంది.ఆమె కుటుంబ ఆనందం, సంతోషం, ఆహారం, ఆలనా పాలనా అన్నింటినీ బాధ్యతగా తీసుకుంటుంది.’ అని స్వామి ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. 

Also Read : గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎంఐఎం ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదు?.. ఎంఐఎం నేత తీవ్ర ఆరోపణలు

కాగా, ఎస్పీ స్పోక్స్‌పర్సన్ ఐపీ సింగ్ రియాక్ట్ అవుతూ అవి స్వామి ప్రసాద్ మౌర్య వ్యక్తిగత వ్యాఖ్యలు అని కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాయి. 

click me!