భారత్‌లో తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. అదుపులేని మరణాలు , రంగంలోకి కేంద్రం

By Siva KodatiFirst Published May 18, 2021, 4:31 PM IST
Highlights

దేశంలో కొత్త కేసుల తగ్గుదలతో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 33,53,765 మంది కోవిడ్‌తో బాధపడుతుండగా.. పాజిటివిటి రేటు 13.29 శాతంగా వుంది. ఇంత ఉద్ధృతిలోనూ రికవరీల సంఖ్య ఊరటనిస్తోంది. 

దేశంలో కొత్త కేసుల తగ్గుదలతో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 33,53,765 మంది కోవిడ్‌తో బాధపడుతుండగా.. పాజిటివిటి రేటు 13.29 శాతంగా వుంది. ఇంత ఉద్ధృతిలోనూ రికవరీల సంఖ్య ఊరటనిస్తోంది. నిన్న 4 లక్షల 22 వేల 436 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

మొత్తంగా రెండు కోట్ల 15 లక్షల 96 వేల 512 మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 85.60గా వుంది. మరోవైపు నిన్న 15,10,418 మందికి టీకా అందింది. మొత్తంగా 18.44 కోట్ల మందికి టీకా డోసుల పంపిణీ జరిగింది. అయితే మరణాల సంఖ్య మాత్రం భారీగా వుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

సోమవారం నాడు 18,69,223 మందికి పరీక్షలు నిర్వహిస్తే  2,63,533 మందికి కరోనా సోకింది. గత ఐదు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. గత 24 గంటల వ్యవధిలో 4329 మంది కరోనాతో మరణించారు. కరోనాతో మరణించిన రోగుల సంఖ్య ఇదే అత్యధికం.  

Also Read:8 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు: లవ్ అగర్వాల్

ఈ నెల 11వ తేదీన కరోనాతో 4,205 మంది మరణించారు. ఆ తర్వాత ఇవే అత్యధిక మరణాలుగా వైద్య ఆరోగ్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. సోమవారం నాడు మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనాతో మరణించారు. ఈ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య వెయ్యిగా నమోదైంది. 

దేశంలో ఇప్పటివరకు 2.52 కోట్ల మందికి కరోనా పాజిటివ్ గా  తేలింది. కరోనాతో ఇప్పటివరకు 2,78,719 చనిపోయారు.కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని వైద్య ఆరోగ్య శాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు కరోనా నుండి రికవరీ అయ్యే  కేసుల సంఖ్య పెరగడం కొంత ఊరటనిస్తోంది. 
 

click me!