8 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు: లవ్ అగర్వాల్

By narsimha lodeFirst Published May 18, 2021, 4:29 PM IST
Highlights

దేశంలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. మంగళవారం నాడు  న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 1.1 శాతంగా ఉంది. దేశంలోని 8 రాష్ట్రాల్లో 1 లక్ష యాక్టివ్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.  8 రాష్ట్రాల్లో 50 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయని ఆయన తెలిపారు. 

98శాతం మంది దేశ జనాభా కరోనా తో హని ఉందన్నారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.  ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నట్టుగా చెప్పారు.  దేశ జనాభాలో 1.8 శాతం ప్రజలు కరోనాకు గురయ్యారని ఆయన తెలిపారు.  దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా మరణాలు పెరగడం ఆందోళన కల్గిస్తోందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలోని 199 జిల్లాల్లో గత మూడు వారాలుగా కరోనా కేసులు తగ్గిపోతున్నాయని ఆయన చెప్పారు. 
 

click me!