కరోనా ఎఫెక్ట్: జూన్ 1 వరకు లాక్‌డౌన్ పొడిగించిన ఒడిశా

Published : May 18, 2021, 04:08 PM IST
కరోనా ఎఫెక్ట్: జూన్ 1 వరకు లాక్‌డౌన్ పొడిగించిన ఒడిశా

సారాంశం

 జూన్ 1వ తేదీ వరకు ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్ ను పొడిగించింది. రాష్ట్రంలో కరోనాను కంట్రోల్ చేసేందుకు లాక్‌డౌన్ మార్గంగా ఆ రాష్ట్రం భావిస్తోంది. 

భువనేశ్వర్: జూన్ 1వ తేదీ వరకు ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్ ను పొడిగించింది. రాష్ట్రంలో కరోనాను కంట్రోల్ చేసేందుకు లాక్‌డౌన్ మార్గంగా ఆ రాష్ట్రం భావిస్తోంది. ఈ నెల 5వ తేదీన ఒడిశా ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్‌డౌన్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నెల 19వ తేదీతో లాక్‌డౌన్ ముగియనుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా కరోనా కంట్రోల్‌కి రావడంతో  లాక్‌డౌన్ ను పొడిగించాలని ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకొంది.లాక్ డౌన్ అమలు చేయకముందు రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 20 శాతంగా ఉంది. లాక్ డౌన్ అమలు చేసిన తర్వాత లాక్‌డౌన్ పాజిటివీ రేటు 18.2 శాతంగా నమోదైంది.

నిత్యావసర సరుకుల కోసం ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి 12 గంటలవరకు మినహాయింపు ఇచ్చారు. అయితే తాజాగా ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకే నిత్యావసర సరుకుల కొనుగోలుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పెళ్లిళ్లకు 50 మంది గతంలో అనుమతి ఇచ్చారు. అయితే తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల్లో పెళ్లిళ్లకు 25 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వధూవరులతో కలుపుకొని 25 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. సంచాయితీరాజ్ శాఖ  తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల్లో  గ్రామ సర్పంచ్ లకు కరోనా కట్టడిలో భాగస్వామ్యం చేస్తూ ఆదేశాలిచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం