కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలతో నేడు దేశంలోని పలు హాస్పిటల్స్ లో కోవిడ్ -19 సన్నద్ధతను పరిశీలించేందుకు మాక్ డిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరగడానికి గల మూడు కారణాలను ఐఎంఏ వెల్లడించింది.
భారతదేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చాలా కాలం వరకు తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇటీవల కాలం నుంచి ఒక్క సారిగా పెరుగుతోంది. అయితే దేశంలో ఇంతలా కేసులు పెరగడానికి ముఖ్యమైన మూడు కారణాలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సోమవారం విడుదల చేసింది. అవి ఏమిటంటే ?
undefined
ఇండియాలో మూడు కారణాల వల్ల కరోనా ఉధృతి ఎక్కువగా ఉందని ఐఎంఏ చెప్పింది. దేశంలో రెండేళ్ల కిందట కరోనా విజృంభించింది. దీంతో ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలను జారీ చేసింది. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే జరిమానాలు విధించింది. కానీ ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో పాటు ప్రభుత్వం ఆంక్షలను కూడా ఉపసంహరించుకుంది. కోవిడ్ -19 ప్రవర్తన సడలింపే ప్రస్తుత కరోనా కేసులు పెరిగేందుకు మొదటి కారణమని ఐఎంఏ పేర్కొంది.
నమాజ్ చేస్తున్న వారిపై దుండగుల దాడి.. మసీదును ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత.. ఎక్కడంటే ?
టెస్టుల సంఖ్య తగ్గడాన్ని రెండో కారణమని తెలిపింది. గతంలో కోవిడ్ ఉధృతి అధికంగా ఉన్న సమయంలో అధికంగా టెస్టులు నిర్వహించేవారు. దీంతో పాజిటివ్ గా తేలిన వారు క్వారంటైన్ లోకి వెళ్లిపోయేవారు. దీంతో కరోనా కంట్రోల్ లో ఉండేది. అయితే ప్రస్తుతం టెస్టుల సంఖ్య తగ్గడంతో కరోనా పాజిటివ్ వ్యక్తులు కూడా తమకు తెలియకుండానే వైరస్ ను వ్యాప్తి చేస్తున్నారు.
ఇక కోవిడ్ కొత్త వేరియంట్ ఆవిర్భావం మూడో కారణంగా ఐఎంఏ తెలిపింది. ఈ వేరియంట్ వ్యాప్తి వల్ల కేసులు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది. భారత్ లో కొత్తగా 5,880 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఐఎంఏ ఈ ప్రకటన చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసులు 35,199కి చేరుకున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.91 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 3.67 శాతానికి పెరిగింది.
ప్రతిపక్షాలపై శరద్ పవార్ ఫైర్.. డిగ్రీ అంశం తప్ప దేశంలో ముఖ్యమైన సమస్యలేమీ లేవా అంటూ కామెంట్స్..
మరోవైపు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సన్నద్ధతను పరిశీలించేందుకు రెండు రోజుల మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. మాక్ డ్రిల్ కసరత్తులో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు పాల్గొంటాయని భావిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఝజ్జర్ లోని ఏయిమ్స్ ను సందర్శించి మాక్ డ్రిల్ను పర్యవేక్షించనున్నారు.
కోవిడ్ -19 వైరస్ ఇతర రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో మరోసారి తన ఉధృతిని చూపిస్తోంది. థానే, పుణె, నాగ్ పూర్, రాయ్ గఢ్, సతారా, పాల్ఘర్ జిల్లాలు మూడంకెల కేసులతో అగ్రస్థానంలో ఉండగా, మిగిలినవి డబుల్ లేదా సింగిల్ డిజిట్ కేసులతో దిగువన ఉన్నాయి. మరణాల్లో ముంబై, పుణె జిల్లాలు రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రభావితమయ్యాయి. ముంబైలో ఇప్పటివరకు 11,57,537 కేసులు, 19,749 మరణాలు నమోదు కాగా, పుణెలో 15,08,156 ఇన్ఫెక్షన్లు, 20,610 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో 14 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,979కి పెరిగింది.