ఎవ‌రీ అమృత్ పాల్ సింగ్? ఎందుకు అరెస్టు చేశారు? ఆయ‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌లు ఏంటి..?

By Mahesh Rajamoni  |  First Published Apr 23, 2023, 3:30 PM IST

Amritpal Singh case: ఖ‌లిస్తానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ ను మోగా పోలీసులు అరెస్టు చేశారు. మోగాలోని గురుద్వారా నుంచి అమృత్ పాల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 36 రోజులుగా పరారీలో ఉన్నాడు. అమృత్ పాల్ కోసం పంజాబ్ నుంచి నేపాల్ వరకు గాలించారు. అయితే, చివ‌ర‌కు మోగా పోలీసుల ముందు లొంగిపోయాడు. 
 


Amritpal Singh Arrested: పరారీలో ఉన్న మత బోధకుడు అమృత్ పాల్ సింగ్ మోగాలోని పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రోడే గ్రామంలోని గురుద్వారా నుంచి అతడిని అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు సోషల్ మీడియాలో ధృవీకరించారు. మార్చి 18 నుంచి అతడు పరారీలో ఉన్నాడు. జలంధర్ లో పలు వాహనాలను మార్చడం, రూపురేఖలు మార్చుకోవడం ద్వారా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగాడు.

ఎవ‌రీ అమృత్ పాల్ సింగ్.. ? 

Tap to resize

Latest Videos

అమృత్ పాల్ సింగ్ "వారిస్ పంజాబ్ దే సంస్థ"కు అధిపతి. ఐదు నెలల క్రితం ఈ సంస్థ పగ్గాలు చేప‌ట్టాడు. అమృత్ పాల్ అమృత్ సర్ లోని జందూపూర్ ఖేరా గ్రామానికి చెందినవాడు. అమృత్ పాల్ కుటుంబం 2012కు ముందు దుబాయ్ వెళ్లింది. అక్కడ కుటుంబం రవాణా పనులు ప్రారంభించింది. 2013లో అమృత్ పాల్ దుబాయ్ లో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేయడం ప్రారంభించాడు.

2022 ఆగస్టులో అమృత్ పాల్ సింగ్ దుబాయ్ నుంచి ఒంటరిగా పంజాబ్ కు వచ్చాడు. అక్టోబర్ లో అమృత్ పాల్ జర్నైల్ సింగ్ భింద్రన్ వాలా విలేజ్ రోడ్ లోని 'వారిస్ పంజాబ్ దే' సంస్థకు కొత్త అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ అల్లర్లలో నిందితుడైన దీప్ సిద్ధూ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో అమృత్ పాల్ తనను తాను జర్నైల్ సింగ్ భింద్రన్ వాలా అనుచరుడిగా అభివర్ణించుకుని తదుపరి యుద్ధానికి సిద్ధం కావాలని సిక్కు యువతకు పిలుపునిచ్చారు. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అతని గురించి దర్యాప్తు ప్రారంభించాయి. దుబాయ్ లోనే ఆయనకు ఖలిస్తానీ భావజాలాన్ని అనుస‌రించ‌డం ప్రారంభించ‌డాని స‌మాచారం.

undefined

అమృత్ పాల్ సింగ్ ను ఎందుకు అరెస్టు చేశారు..? 

పరారీలో ఉన్న మత బోధకుడు అమృత్ పాల్ సింగ్ మోగాలోని పంజాబ్ పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయాడు. రోడే గ్రామంలోని గురుద్వారా నుంచి అతడిని అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు సోషల్ మీడియాలో ధృవీకరించారు. మార్చి 18 నుంచి అతడు పరారీలో ఉన్నాడు. జలంధర్ లో పలు వాహనాలను మార్చడం, రూపురేఖలు మార్చుకోవడం ద్వారా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.

ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్ గా ప్రభుత్వం ముద్ర వేసిన అమృత్ పాల్ సింగ్ కొన్నేళ్లుగా పంజాబ్ లో క్రియాశీలకంగా ఉంటూ తరచూ సాయుధ మద్దతుదారులతో కలిసి వస్తున్నారు. ఖలిస్థాన్ వేర్పాటువాది, ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే శిష్యుడినని, ఆయన అనుచరులు 'భింద్రన్ వాలే 2.0'గా పిలుచుకుంటారు. వారిస్ పంజాబ్ దే చీఫ్ తో పాటు అతని సహచరులు అనేక అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, హత్యాయత్నం, పోలీసులపై దాడి, ప్రభుత్వోద్యోగులు చట్టబద్ధంగా విధులు నిర్వర్తించడంలో అడ్డంకులు సృష్టించడం వంటి పలు క్రిమినల్ కేసులు ఆయనపై నమోదయ్యాయి.

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు.. 

అమృత్ పాల్ సింగ్ అనుచరుల నుంచి పెద్ద ఎత్తున తుపాకులు లభించడంతో ఆయుధాల చట్టం కింద ఆయనపై తాజా అభియోగాలు నమోదయ్యాయి. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో పాటు విదేశాల్లోని పలు ఉగ్రవాద సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. యూకేలో నివసిస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాది అవతార్ సింగ్ ఖండాతో అమృత్ పాల్ కు సంబంధాలున్నాయని, ఉగ్రవాద ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు. హింసాత్మక నిరసనల్లో పాల్గొనే "ప్రైవేట్ మిలీషియా" ను ఏర్పాటు చేయడానికి మాదకద్రవ్యాల పునరావాస కేంద్రాల నుండి యువకులను రిక్రూట్ చేసుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న తుపాకుల నిల్వ కేంద్రంగా ఈ డీ అడిక్షన్ కేంద్రాలు పనిచేశాయని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జాతీయ భద్రతా చట్టం కింద పాపల్ ప్రీత్ సింగ్ సహా ఎనిమిది మంది సహచరులను జైల్లో ఉంచిన అమృత్ పాల్ ను ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ కు తరలిస్తున్నార‌ని స‌మాచారం.

click me!