నా సింప్లిసిటీ చూసి ప్రధానికి అత్తనంటే ఎవరు నమ్మలేదు - సుధామూర్తి

By Asianet NewsFirst Published May 16, 2023, 7:41 AM IST
Highlights

తన సింప్లిసిటీ, చీరకట్టు చూసి తాను యూకే ప్రధాని రిషి సునక్ అత్తగారినంటే ఓ ఇమ్మిగ్రేషన్ అధికారి నమ్మలేదని సుధామూర్తి అన్నారు. తాను యూకే ప్రధాని అధికారిక నివాసం చిరునామా రాస్తే.. జోక్ చేస్తున్నారా ? అని అడిగారని ఆమె గుర్తు చేసుకున్నారు. 

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి అంటే మన దేశంలో ఎవరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఓ రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్, వితరణశీలిగా అందరికీ సుపరిచితురాలే. అయితే ఆమె లండన్ కు వెళ్లినప్పుడు తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఓ టీవీ షోలో ఇటీవల పంచుకున్నారు.

సీఎం పదవి ఇవ్వకపోయినా రెబల్ గా మారను, బ్లాక్ మెయిల్ చేయను : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

తాజాగా విడుదలైన ‘ది కపిల్ శర్మ’షో ఏపిసోడ్ లో ఈ విషయం బయటకు వచ్చింది. అందులో తాను కొంత కాలం కిందట యూకేకు వెళ్లానని చెప్పారు. అయితే అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను ఎక్కడ ఉంటారని అడిగారని అన్నారు. అయితే తన కుమారుడు కూడా లండన్ లో ఉన్నప్పటికీ.. అతడి అడ్రెస్ సరిగ్గా తనకు గుర్తు లేదని అన్నారు. దీంతో తాను యూకే ప్రధానమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం అయిన ‘10 డౌనింగ్ స్ట్రీట్’ చిరునామా రాశానని గుర్తు చేశారు.

కర్ణాటక సీఎం రేసులో సిద్ధరామయ్య ముందంజ.. బ్యాలెట్ ఓటింగ్ లో ఆయన వైపే ఎమ్మెల్యేల మొగ్గు..?

అయితే తన సింప్లిసిటీ చూసి ఆ ఇమ్మిగ్రేషన్ అధికారి నమ్మలేదని చెప్పారు. దీంతో అతడు తమ వైపు చూసి ‘జోక్ చేస్తున్నారా ?’ అని ప్రశ్నించాడని తెలిపారు. ‘‘నహీ, సచ్చి బోల్టీ హు (లేదు, నేను నిజం చెబుతున్నాను)’’ అని చెప్పాను. ‘‘అతడు నేను జోక్ చేస్తున్నానని అనుకున్నాడు. 72 ఏళ్ల సాధారణ మహిళ అయిన నేను ప్రధానికి అత్తను అవుతానని ఆయన నమ్మలేదు’’ అని అన్నారు. 

లా అండ్ ఆర్డర్ పై నమ్మకం ఉంచండి.. నిరసన విరమించండి - రెజర్లకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుపు

కాగా.. ఈ ఎపిసోడ్ లో ఆమెతో పాటు ఇటీవల ఆస్కార్ గెలుచుకున్న నిర్మాత గునీత్ మోంగా, నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పొందిన నటి రవీనా టాండన్ ఉన్నారు. ఏప్రిల్ లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సుధామూర్తికి పద్మభూషణ్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాపారవేత్త నారాయణ్ మూర్తిని సుధామూర్తి వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె అక్షత బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ భార్య.
 

click me!