సీఎం పదవి ఇవ్వకపోయినా రెబల్ గా మారను, బ్లాక్ మెయిల్ చేయను : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

By Asianet NewsFirst Published May 16, 2023, 6:57 AM IST
Highlights

తాను అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ అన్నారు. సీఎం పదవి వరించకపోయినా.. పార్టీలోనే కొనసాగుతానని, తిరుగుబాటు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. 

కర్ణాటక సీఎం పదవి ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ముల్లగుల్లాలు పడుతోంది. కర్ణాటక ప్రజలు ఆ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ.. సీఎం పీఠం కేటాయింపు అంశం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎవరికి సీఎం పదవి కట్టబెట్టినా మరొకరు చిన్నబోతారు. వారి వల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ కీలక ప్రకటన చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ఉచిత హామీల ఖరీదు రూ.62,000 కోట్లు!

కర్ణాటక సీఎంగా అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేసినా పర్వాలేదని ఆయన చెప్పారు. తనకు సీఎం పదవికి కేటాయించకపోయినా తాను పార్టీపై తిరుగుబాటు చేయబోనని డీకే శివ కుమార్ స్పష్టం చేశారు. బ్లాక్ మెయిల్ చేయబోనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎన్డీటీవీ’తో మాట్లాడుతూ.. సోనియా గాంధీపై తనకు నమ్మకం ఉందని అన్నారు. ‘‘నేను తిరుగుబాటు చేయను. బ్లాక్ మెయిల్ కు పాల్పడబోను. ఈ విషయాన్ని ఇద్దరు సీనియర్ నేతలకే వదిలేశాను. బెంగళూరులో కూర్చొని నా రెగ్యులర్ బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. మీకు ప్రాథమిక మర్యాద, కొంచెం కృతజ్ఞత ఉండాలి. గెలుపు వెనుక ఎవరున్నారో గుర్తించే మర్యాద వారికి ఉండాలి’’ అని అన్నారు.

Ajit Pawar: అయినా.. బీజేపీ-శివసేన సర్కార్‌కు ఎలాంటి ప్రమాదం లేదు... అజిత్ పవార్ సంచలన వ్యాఖ్య

ఇదిలావుండగా.. కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం మధ్యాహ్నం కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. నేటి మధ్యాహ్నానికల్లా కర్ణాటక సీఎం అభ్యర్థిపై నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారని చెప్పారు.
పరిశీలకులు ఎమ్మెల్యేలతో మాట్లాడారని, వారు హైకమాండ్ కు నివేదిక సమర్పిస్తారని తెలిపారు.

కాగా.. సీఎం పదవి వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పరిశీలకులు తమ అభిప్రాయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ఇద్దరు నాయకులు చెరో రెండున్నర సంవత్సరాలు సీఎం పీఠాన్ని పంచుకోవాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పరిశీలకుల నివేదికపై సోనియా గాంధీతో మల్లికార్జున ఖర్గే మాట్లాడే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి డీకే శివకుమార్ సోమవారం ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ తన పుట్టిన రోజు సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి, పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈరోజు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. 

కర్ణాటక సీఎం రేసులో సిద్ధరామయ్య ముందంజ.. బ్యాలెట్ ఓటింగ్ లో ఆయన వైపే ఎమ్మెల్యేల మొగ్గు..?

224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన ఎన్నికలు జరిగాయి. 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తంగా 136 స్థానాలు గెలుపొందింది. బీజేపీ 66 స్థానాలతోనే సరిపెట్టుకుంది. జేడీఎస్ 19 స్థానాలకే పరిమితం అయ్యింది. అయితే పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ.. సీఎం పదవికి అభ్యర్థిని ఖరారు చేసే అంశం కాంగ్రెస్ కు కష్టసాధ్యంగా మారింది. 

click me!