లోక్‌సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం సమర్పించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ శ్వేతపత్రాన్ని తీసుకొచ్చింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు నిర్మలా సీతారామన్.
భారత ఆర్ధిక వ్యవస్ధపై కేంద్రంలోని నరేంద్ర మోడీ గురువారం శ్వేతపత్రం విడుదల చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని, మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని పోల్చుతూ ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. నాటి యూపీఏ ప్రభుత్వం ఆరోగ్యవంతమైన ఆర్ధిక వ్యవస్ధను వారసత్వంగా పొందిందని, కానీ పదేళ్ల దాని పాలనలో పనితీరు లేని ఆర్ధిక వ్యవస్ధగా మార్చిందని ఆరోపించింది.
2014లో గద్దె దిగిన యూపీఏ ప్రభుత్వం.. ఆర్ధిక నిర్వహణలో తప్పిదాలు, హ్రస్వ దృష్టితో వ్యవహరించడం బలహీనమైన ఆర్ధిక వ్యవస్ధకు పునాది వేశాయని మోడీ ప్రభుత్వం.. మన్మోహన్ సర్కార్‌పై దాడి చేసింది. ఆర్ధిక సరళీకరణను తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సూత్రాలను .. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పక్కనబెట్టిందని శ్వేతపత్రం పేర్కొంది.
undefined
మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తి చేసుకున్న రోజే.. ఆర్ధిక దుర్వినియోగం, ఆర్ధిక క్రమశిక్షణారాహిత్యం, విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని కేంద్రం విమర్శించింది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆర్ధిక వ్యవస్ధ క్లిష్ట పరిస్ధితుల్లో వుందని శ్వేతపత్రం పేర్కొంది. పబ్లిక్ ఫైనాన్స్ పేలవమైన స్థితిలో వున్నాయని, ఆర్ధిక దుర్వినియోగం, ఆర్ధిక క్రమశిక్షణారాహిత్యం , విస్తృతమైన అవినీతి వుందన్నారు.