సెల్పీ తీసుకుంటుండగా రిజర్వాయర్ లో ఫోన్ పడిపోయిందని.. 21 లక్షల లీటర్ల నీటిని తోడేసిన గవర్నమెంట్ ఆఫీసర్..

By Asianet NewsFirst Published May 27, 2023, 9:01 AM IST
Highlights

రిజర్వాయర్ లో ఫోన్ పడిపోయిందని ఓ గవర్నమెంట్ ఆఫీసర్ అందులో ఉన్న 21 లక్షల లీటర్ల నీటిని పంపులు పెట్టి తోడించేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ వెలుగులోకి వచ్చింది. స్థానిక కలెక్టర్ ఆ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. 

ఛత్తీస్‌గఢ్ లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కాంకేర్ జిల్లాలో ఓ గవర్నమెంట్ ఆఫీసర్ సెల్పీ తీసుకుంటుండగా ఖరీదైన సెల్ ఫోన్ రిజర్వాయర్ లో పడిపోయింది. దీంతో తన పరపతిని ఉపయోగించి అతడు ఆ రిజర్వాయర్ ను ఖాళీ చేయించాడు. సుమారు 21 లక్షల లీటర్ల నీటిని తోడించేశాడు. ఈ ఘటన బయటకు రావడంతో కలెక్టర్ అతడికి నోటీసులు జారీ చేశారు. ప్రతిపక్ష నాయకులు అధికార పక్షంపై విమర్శలు చేస్తున్నారు. 

కిరాతకం.. వృద్ధుడిని హత్య కేసిన యువజంట.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ట్రాలీబ్యాగులో వేసి..

వివరాలు ఇలా ఉన్నాయి. కాంకేర్ జిల్లాలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గా  పని చేస్తున్న రాజేష్ విశ్వాస్ తన స్నేహితులతో కలిసి ఆదివారం (మే 21) పఖంజూర్ ప్రాంతంలో ఉన్న పర్లాకోట్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడు రిజర్వాయర్ పై నిలబడి తన ఖరీదైన శాంసంగ్ ఎస్ 23 మొబైల్ తో సెల్పీ తీసుకుంటుండగా.. అది చేజారి నీటిలో పడిపోయింది. ఆ సమయంలో రిజార్వాయర్ లో 15 అడుగుల లోతులో నీరు నిల్వ ఉంది.

దీంతో కేవలం ఫోన్ ను వెతకడానికి రిజర్వాయర్ లోని నీటిని తోడేయాలని భావించాడు. దీంతో రాజేశ్ విశ్వాస్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ను సంప్రదించి నీటిని తొలగించేందుకు 30 హెచ్ పీ పంపులను మంగళవారం అమర్చారు. ఇలా మూడు రోజుల పాటు జలాశయం నుంచి నీటిని బయటకు పంపించాడు. ఇలా సుమారు 21 లక్షల లీటర్ల నీటిని తోడేశాడు. చివరికి అతడి ఫోన్ గురువారం లభించింది.  ఈ మొత్తం వ్యవహారం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు చేరడంతో ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పంపును నిలిపివేశారు.

పల్నాడులో దారుణం.. మద్యం మత్తులో కుమారుడితో గొడవ.. తల నరికి, సంచిలో ఉంచి ఊరంతా తిరిగిన తండ్రి..

శుక్రవారం ఈ విషయం వెలుగులోకి రావడంతో కాంకేర్ జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్లా విశ్వాస్‌ను సస్పెండ్ చేశారు. రిజర్వాయ్ లోని నీటిని తోడుకునేందుకు మౌఖిక అనుమతి ఇచ్చిన జలవనరుల శాఖ ఎస్‌డీఓ ఆర్‌సీ ధీవర్‌కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జలాశయం నుంచి నీటిని బయటకు పంపే అధికారం రాజేశ్ విశ్వాస్ కు లేదని కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఫుడ్ ఇన్స్ పెక్టర్ పై చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

కాగా.. ఇన్ని లక్షల లీటర్ల నీటిని తోడేసి పొందిన ఫోన్ చివరికి పని చేయకపోవడం గమనార్హం. రూ.95 వేల విలువైన ఫోన్ కోసం ఎంతో మంది రైతుల జీవనోపాధిపై ఆయన దెబ్బకొట్టారు. ఈ నీటిని స్థానిక రైతులు వ్యవసాయానికి ఉపయోగించేవారు. దీనిపై రాజేశ్ విశ్వాస్ మాట్లాడుతూ.. తాను కేవలం మూడు అడుగుల మేర నీటిని మాత్రమే స్థానికుల సాయంతో తోడేశానని, వాటిని వృథా కానివ్వలేదని, సమీపంలోని చెరువులోకి పంపించానని చెప్పారు. 

నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి బ్రిజ్‌ భూషణ్‌ హాజరైతే.. రెజ్లర్ల వార్నింగ్

ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్‌ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. భూపేష్ బఘేల్ ప్రభుత్వంలోని అధికారులు రాష్ట్రాన్ని తమ పూర్వీకుల ఆస్తిగా భావిస్తున్నారని అన్నారు. ఈ వేసవి కాలంలో ప్రజలు తాగే నీటి కోసమే ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. కానీ అధికారులు మాత్రం తమ మొబైళ్ల కోసం లక్షల నీటిని వృథా చేస్తున్నారని విమర్శించారు. ఈ నీటితో సుమారు 1,500 ఎకరాలకు సాగు నీరు అందేదని ట్వీట్ చేశారు. 

click me!