బటన్ నొక్కితే.. లిఫ్ట్ రాకున్నా తెరుచుకున్న డోర్లు.. లోపలికి అడుగుపెట్టి, గ్రౌండ్ ఫ్లోర్ లో పడి వ్యక్తి మృతి

By Asianet News  |  First Published Oct 30, 2023, 5:08 PM IST

ఓ వ్యక్తి నాలుగో అంతస్తు నుంచి కిందికి రావాలనే ఉద్దేశంతో లిఫ్ట్ బటన్ నొక్కాడు. కొంత సమయం తరువాత లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. కానీ లిఫ్ట్ మాత్రం రాలేదు. దీనిని గమనించకుండా అతడు లోపలికి ప్రవేశించి కింద పడిపోయాడు. దీంతో అతడు తీవ్ర గాయాలతో మరణించాడు.


జార్ఖండ్ లోని రాంచీలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి లిఫ్ట్ కోసం బటన్ నొక్కారు. అయితే లిఫ్ట్ రాకపోయినా దాని డోర్స్ తెరుచుకున్నాయి. ఆ విషయం గమనించక అతడు లోపలికి అడుగుపెట్టాడు. దీంతో అతడు నేరుగా గ్రౌండ్ ఫ్లోర్ లో పడి మరణించాడు. ఈ ఘటనపై ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జమ్మూకాశ్మీర్ లో దారుణం.. యూపీకి చెందిన వలస కార్మికుడిని హతమార్చిన ఉగ్రవాదులు..

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. రాంచీలో సిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో శైలేష్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన ప్లాట్ నాలుగో అంతస్తులో ఉంటుంది.  ఆయన శుక్రవారం తన పనుల నిమిత్తం బయటకు వెళ్లాలని అనుకున్నాడు. ప్లాట్ లో నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ బటన్ నొక్కాడు. అయితే అప్పటికీ నాలుగో అంతస్తకు లిఫ్ట్ చేరుకోలేదు. కానీ వెంటనే డోర్లు తెరుచుకున్నాయి.

పినరయి విజయన్ ఒక అబద్ధాలకోరు - కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

దీనిని శైలేష్ గమనించలేదు. ఏమరుపాటులో లోపలికి ప్రవేశించాడు. ఇక అంతే ఆయన గాల్లోనే కిందికి జారుతూ గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఒక్క సారిగా భారీ శబ్దాలు వినిపించడంతో భవనంలోని సెక్యూరిటీ గార్డు, స్థానికులు అతడిని రక్షించేందుకు పరుగులు తీశారు. కానీ అప్పటికే బాధితుడు మరణించాడు.

బస్సును ఢీకొన్న స్కూల్ వ్యాన్.. ముగ్గురు చిన్నారులు, డ్రైవర్ మృతి, 16 మందికి గాయాలు.. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ లిప్ట్ ను అధికారులు మూసివేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!