విపక్షాలు కూటమికి ఇండియా పేరు పెట్టడంపై అభ్యంతరం.. ఎన్నికల సంఘం రియాక్షన్ ఇదే

By Mahesh K  |  First Published Oct 30, 2023, 3:56 PM IST

విపక్షాలు తమ కూటమికి అక్రోనిమ్ ఇండియా వచ్చేలా పేరు పెట్టుకున్నాయి. దీనిపై అభ్యంతరం చెబుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ ఫైల్ అయింది. దీనికి ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.
 


న్యూఢిల్లీ: 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ కూటమికి షార్ట్ ఫామ్‌ ఇండియా వచ్చేలా పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టుకోవడాన్ని అభ్యంతరిస్తూ ఓ పిటిషనర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ రాజకీయ పార్టీలను నియంత్రించి ఇండియా పేరు మార్చుకునేలా చేయాలని కోరాడు. ఈ పిటిషన్ పై కేంద్ర ఎన్నికల సంఘం తన సమాధానాన్ని ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29ఏ  కింద అసోసియేషన్లు, ఇండివిడ్యువల్ బాడీలను రాజకీయ పార్టీలుగా నమోదు చేసే అధికారం తమకు ఉన్నదని ఈసీఐ తెలిపింది. కానీ, రాజకీయ కూటములను తాము గుర్తించబోమని వివరించింది. రాజ్యాంగంలోని చట్టాల కింద వీటిని రెగ్యులేటెడ్ ఎంటిటీస్‌గా గుర్తించలేమని పేర్కొంది.

Latest Videos

undefined

బిజినెస్‌మ్యాన్ గిరీశ్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇండియా అనే పేరు పెట్టుకోవడం ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లపై ప్రభావం చూపుతుందని తెలిపాడు. జాతీయ చిహ్నంలో ఇండియా అనే పేరు ఉంటుందని, కాబట్టి, ఎంబ్లెమ్ అండ్ నేమ్స్ వయలేషన్‌గా దీన్ని పరిగణించాలని వాదించాడు.

Also Read: తెలంగాణ ఎన్నికలు 2023 : ఆ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్..ఎందుకంటే..

ఈ పిటిషన్‌కు ఇచ్చిన సమాధానంలో ఈసీఐ తన సమాధానాన్ని ఇండియా అనే పేరును వినియోగిం చడానికి చట్టబద్ధంగా సమ్మ మే అనే కోణంలో చూడరాదని, పేరును నియంత్రించడంలో ఈసీఐకి ఉన్న పరిమితుల కోణంలోనే చూడాలని పేర్కొంది.

click me!