కరుణానిధి నల్ల కళ్లజోళ్ల రహస్యమిదే

Published : Aug 07, 2018, 09:34 PM IST
కరుణానిధి నల్ల కళ్లజోళ్ల రహస్యమిదే

సారాంశం

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి నల్ల కళ్లద్దాలను వాడుతారు.  నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉంది. కరుణానిధి తరహలో అనేక మంది నల్ల కళ్లద్దాలను ఉపయోగిస్తారు


చెన్నై:తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి నల్ల కళ్లద్దాలను వాడుతారు.  నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉంది. కరుణానిధి తరహలో అనేక మంది నల్ల కళ్లద్దాలను ఉపయోగిస్తారు. 46 ఏళ్ల పాటు ఆయన నల్ల కళ్లద్దాలను ఉపయోగించారు. అయితే కరుణానిధి నల్ల కళ్లద్దాలను ఉపయోగించడం వెనుక  ఓ కారణం ఉందని డీఎంకె వర్గాలు చెబుతాయి.

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఎప్పుడూ చూసినా నల్ల కళ్లజోళ్లను ధరించేవారు.  సాధారణంగా ఈ రకమైన జోళ్లను చాలా అరుదుగా ఉపయోగిస్తారు. కానీ, కరుణానిధి మాత్రం ఎప్పుడూ కూడ నల్ల కల్లద్దాలను ఉపయోగించేవారు.

1960లో  కరుణానిధికి ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కరుణానిధి ఎడమ కంటికి గాయమైంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు కరుణానిధి నల్లకల్లద్దాలను ఉపయోగించేవారు.  ఈ రకంగా సుమారు 46 ఏళ్ల పాటు  కరుణానిధి నల్లకళ్లద్దాలను  వాడారు.

అయితే గత ఏడాది 2017లో కరుణానిధి జర్మనీ నుండి  తెప్పించిన తెల్ల కళ్లద్దాలు తెప్పించారు. అప్పటి నుండి నల్ల కళ్లద్దాలకు బదులుగా కరుణానిధి తెల్ల కళ్లద్దాలను ఉపయోగిస్తున్నారు. కరుణానిధి ప్రాణ స్నేహితుడు ఎంజీఆర్ కూడ నల్ల కళ్లద్దాలను ఉపయోగించేవాడు.
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే