కరుణానిధి కన్నుమూత: రేపు సెలవు, ఏడు రోజులు సంతాపదినాలు

First Published Aug 7, 2018, 9:33 PM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి సంతాపం ప్రకటిస్తూ తమిళనాడు ప్రభుత్వం రేపు (బుధవారం) సెలవు దినంగా ప్రకటించింది. ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి సంతాపం ప్రకటిస్తూ తమిళనాడు ప్రభుత్వం రేపు (బుధవారం) సెలవు దినంగా ప్రకటించింది. ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

తమిళనాడులోని అన్ని పాఠశాలలు రేపు సెలవు దినంగా ప్రకటించాయి. ముందస్తు జాగ్రత్తగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమిళనాడుకు బస్సు సర్వీసులను నిలిపేసింది.

కరుణానిధికి సంతాప సూచకంగా పలు థియేటర్లు మంగళవారం సాయంత్రం షోలను రద్దు చేశాయి. కరుణానిధి మరణించినట్లు కావేరీ ఆస్పత్రి మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రకటించింది.

ప్రధాని మోడీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరుణానిధి మృతికి సంతాపం ప్రకటించినవారిలో ఉన్నారు.

click me!