నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో శనివారం సాయంత్రం భద్రతా బలగాలు.. మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈశాన్య భారత ప్రాంతమైన నాగాలాండ్ (Nagaland) లో శనివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. మిలిటెంట్లు అని భావించి భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖపైనా విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నదంటూ ప్రశ్నించారు. దేశంలో పౌరులకు, భద్రతా బలగాలకు రక్షణ లేదా? అంటూ ప్రశ్నించారు.
Also Read: కేజ్రీవాల్ ఇంటి ముందు సిద్దూ ధర్నా.. పరిస్థితి ఉద్రిక్తం
undefined
Rahul Gandhi ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఇది హృదయ విదారక ఘటన. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిజమైన సమాధానం ఇవ్వాలి. దేశంలో పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు అసలు హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్లు’ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలావుండగా, రాష్ట్ర ప్రజలు హార్న్‌బిల్ అనే పండుగను జరుపుకొంటున్న సమయంలో మిలిటెంట్లుగా భావించిన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. నాగాలాండ్ (Nagaland) లోని మోన్ జిల్లాలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల కారణంగా మొత్తం 13 మంద ప్రాణాలు కోల్పోయారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయ్‌ప్యూ రియో ఇప్పటికే అత్యున్నత స్థాయి సిట్ దర్యాప్తునకు ఆదేశించించారు. భద్రతా బలగాలు పౌరులు ప్రయాణిస్తున్న వాహనం పై పొరపాటున కాల్పుుల జరిపారా, లేదా ఉద్దేశ్యపూర్వకంగా కాల్పులు జరిపారా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు. బాధిత కుటుంబాలకు న్యాయం అందేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు ఓ ప్రకటన సైతం విడుదల చేశారు. పౌరులు ప్రణాలు పోవడంపై విచారణ వ్యక్తం చేస్తూ.. దీనికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: విదేశీ కంపెనీల చేత్తుల్లోకి తెలంగాణ భూ వివరాలు.. రాములమ్మ సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్త చేశారు. దేశంలో పౌరులకు, భద్రతా బలగాలకు రక్షణ లేదా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం Rahul Gandhi కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో రెచ్చిపోయారు. వివాదాస్పద సాటు చట్టాల రద్దు నేపథ్యంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. చనిపోయిన రైతుల వివరాలు ప్రభుత్వాన్ని తాము అందిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Also Read: ఆ ఐదు రాష్ట్రాల్లో మహిళలపైనే రాజకీయ పార్టీల నజర్ ఎందుకు?
This is heart wrenching. GOI must give a real reply.
What exactly is the home ministry doing when neither civilians nor security personnel are safe in our own land? pic.twitter.com/h7uS1LegzJ