దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మిత్రపక్ష పార్టీలతో నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మూడోసారి ప్రధాని అవుతున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ విషయం చంద్రబాబు చెప్పిందే జరిగిందన్నారు.
ఢిల్లీలో జరిగిన ఎన్‌డీయే మిత్రపక్ష ఎంపీల సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ప్రధాని మోదీని ఎన్‌డీయే పక్ష నేతగా ఎన్నుకునేందుకు జనసేన తరఫున మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ కల్యాణ్... మోదీ విషయంలో చంద్రబాబు చెప్పినట్లే జరుగుతోందన్నారు. మోదీ రానున్న పదిహేనేళ్లు ప్రధాన మంత్రిగా ఉంటారని 2014లో చంద్రబాబు చెప్పారన్నారు. దేశ అభివృద్ధి కోసం తామంతా అండగా ఉంటామని తెలిపారు. అంధ్రప్రదేశ్ పురోభివృద్ధి కోసం విజనరీ నాయకత్వంలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు...