బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో బెంగుళూరు కోర్టు రాహుల్ కు బెయిల్ ఇచ్చింది.
పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. భారతీయ జనతా పార్టీపై అవినీతి అరోపణలకు సంబంధించి దాఖలైన కేసులో బెంగుళూరు కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అవినీతిలో భారతీయ జనతా పార్టీ 40 శాతం కమిషన్ తీసుకుంటోందంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ పత్రిక ప్రకటనలు జారీ చేసింది. ఈ విషయంలో బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు... రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.