Deepfake: డీప్‌ఫేక్ అంటే ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?

By Rajesh Karampoori  |  First Published Nov 17, 2023, 5:28 PM IST

Deepfake: ప్రస్తుతం డీప్‌ఫేక్‌ (Deepfake) అనే పదం  దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా డీప్‌ఫేక్ పై స్పందించారు. ఇంతకీ డీప్‌ఫేక్ అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు?  


Deep fake: మన దేశంలో 'Deep fake' అనే పదం గత వారం రోజులుగా తెగ వినిపిస్తోంది.  ప్రముఖులు కూడా డీప్‌ఫేక్ బారిన పడినట్లు, ప్రధానంగా ప్రముఖ నటి రష్మిక మందన్న 'డీప్‌ఫేక్' అరాచకానికి బలైనట్టు వార్తలు వెలువడటంతో ఈ పదం చర్చనీయంగా మారింది. అలాగే.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా డీప్‌ఫేక్ వీడియోలపై స్పందించారు.

Deep fake అనేది భారతదేశానికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని పేర్కొన్నారు. వీటిని రూపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేయడం ఆందోళనకరమైన విషయం అని ప్రధాని ధ్వజమెత్తారు. డీప్‌ఫేక్‌లను ఫ్లాగ్ చేయాలని, అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రసారం అయినప్పుడు వార్నింగ్ ఇవ్వాలని తాను ఛాట్ జీపీటీ బృందాన్ని కోరినట్లు ప్రధాని మోదీ తెలిపారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా డీప్‌ఫేక్ వీడియోలకు బలైన వారే కావడం గమనార్హం.

Latest Videos

undefined

  డీప్‌ఫేక్‌ అంటే ఏమిటి?

ఇంతకీ డీప్ అంటే ఏమిటి? వాటిని ఎలా తయారు చేస్తారనే చర్చ మొదలైంది. డీప్‌ఫేక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఏఐ సహాయంతో ఏదైనా ఫోటో లేదా వీడియోలో ఒకరి ముఖం స్థానంలో వేరొకరి ముఖాన్ని పెట్టడాన్నే డీప్‌ఫేక్ అంటారు. ఇలా ఒకరి ముఖం స్థానంలో వేరొకరి ముఖాన్ని అమర్చడానికి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)సాయంతో డీప్ లెర్నింగ్ అనే ప్రత్యేక మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించారు. డీప్‌ఫేక్ వీడియోలను ఎన్‌కోడర్, డీకోడర్ నెట్‌వర్క్‌ల కలయికను ఉపయోగించి తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో  వీడియో, ఫోటో, ఆడియోలో సులభంగా మార్పులు చేయవచ్చు. ఇలా AI సాయంతో మార్చిన వాటిలో  ఫేక్ ఏదో, రియల్ ఏదో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. 

మొదటి ఎవరు చేశారంటే?

ది గార్డియన్ ప్రకారం.. డీప్‌ఫేక్ కంటెంట్‌ను మొదటిసారిగా 2014లో సింథటిక్ మీడియా అని పిలిచేవారు. దానికి జనాదరణ పెరగడంతో డీప్‌ఫేక్ అనే పదం 2017లో వాడుకలోకి వచ్చింది. 'రెడ్డిట్' నిర్వహాకులు జెనరేటివ్ అడ్వర్సరియల్ నెట్‌వర్క్స్ (GANs)టెక్నిక్‌ని ఉపయోగించి తొలిసారి  డీప్‌ఫేక్ వీడియోని క్రియేట్ చేశారు. డీప్‌ఫేక్ ద్వారా తయారుచేసిన వీడియోలో ఒక వ్యక్తి తాను చెప్పని విషయాలను చెప్పడాన్ని చూపించవచ్చు. 2018నాటికి ఈ టెక్నాలజీ మరింత డెవలప్ అయ్యింది. దీనికి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడంతో మరింత డెంజరస్ గా మారింది.

ఎలా గుర్తించవచ్చు ?

వాస్తవానికి డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించడం కష్టమే.. కానీ వాటిని నిశితంగా పరిశీలించడం ద్వారా వాటిని గుర్తించవచ్చని ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నకిలీ వీడియోలను సృష్టించడం చాలా తేలిక. కానీ, ఒక వ్యక్తి ముఖ కవలికలు, చర్మం రంగు, ఫోటోలో లేదా వీడియోలో ఉన్న లైటింగ్‌ ను ఒరిజినల్ వీడియోలో ఉన్న మాదిరిగా ఫేక్ వీడియోలో డెవలప్ చేయలేరు. ముఖకవలికలు, కంటి రెప్పలు,పెదవుల  కదలికల ద్వారా డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు. వీడియోను ఎవరు షేర్ చేస్తున్నారా? దానిని బట్టి కూడా డీప్ ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు.  

ఎలా సేఫ్ గా ఉండాలి? 


డీప్‌ఫేక్‌ల నుండి రక్షించడానికి మార్గాలివే.. 

>> డీప్‌ఫేక్‌ల నుండి రక్షించడానికి సోషల్ మీడియా గోప్యతా సెట్టింగ్‌లను మార్చండి.

>> అదనపు భద్రత కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. 

>> మరింత భద్రత కోసం డబుల్ వేరిఫికేషన్ కూడా ఆన్ చేయండి.

click me!