బెంగాల్ ఎన్నికల హింస:స్వతంత్ర ద‌ర్యాప్తు, బాధితుల‌కు ఆర్థికం సాయం కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

Published : Jul 10, 2023, 03:03 PM IST
బెంగాల్ ఎన్నికల హింస:స్వతంత్ర ద‌ర్యాప్తు, బాధితుల‌కు ఆర్థికం సాయం కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

సారాంశం

West Bengal Panchayat Election 2023: పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలలో హింసాత్మక వివాదం తర్వాత, రాష్ట్రంలో మరోసారి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో జూలై 10న మొత్తం 696 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం, బీఎస్ఎఫ్ అధికారులకు లేఖ రాశారు. రీపోలింగ్ సమయంలో శాంతిభద్రతలు కాపాడాలని కాంగ్రెస్ నేత లేఖలో అభ్యర్థించారు.   

WB Panchayat Election 2023: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల హింసాకాండ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలనీ, దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరికి కలకత్తా హైకోర్టు సోమవారం అనుమతించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం ముందు వ్యక్తిగతంగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు చౌదరి జూలై 8న జరిగిన ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్ మొత్తం మునుపెన్నడూ లేని విధంగా హింసాకాండకు గురైందని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనని, మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టును కోరారు.

హత్యలు, తుపాకులు, క్రూడ్ బాంబుల వాడకం సహా హింసాత్మక ఘటనలపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జస్టిస్ హిరణ్మయ్ భట్టాచార్యతో కూడిన ధర్మాసనం ఆయనకు పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. చనిపోయిన వారి దహన సంస్కారాలు, క్షతగాత్రులకు చికిత్స సక్రమంగా జరిగేలా కొంత ఆర్థిక ప్రయోజనం కల్పించాలని కోరారు. మూడంచెల పంచాయతీ వ్యవస్థకు సంబంధించి శనివారం 61 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. పలు చోట్ల దొంగ ఓట్లు వేయడం, బ్యాలెట్ బాక్సులను దోచుకోవడం, తగలబెట్టడం లేదా ధ్వంసం చేయడం రాజకీయ ఘర్షణలకు దారితీసింది.

పశ్చిమ బెంగాల్‌ పంచాయితీ ఎన్నికలలో హింసాత్మక వివాదం తర్వాత, రాష్ట్రంలో మరోసారి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో జూలై 10న మొత్తం 696 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.  అంత‌కుముందు, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం, బీఎస్ఎఫ్ అధికారులకు లేఖ రాశారు. రీపోలింగ్ సమయంలో శాంతిభద్రతలు కాపాడాలని కాంగ్రెస్ నేత లేఖలో అభ్యర్థించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసాత్మక పరిస్థితులపై ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు రీపోలింగ్ సమయంలో శాంతిభద్రతలు కాపాడాలని కాంగ్రెస్ నేత లేఖలో అభ్యర్థించారు. రాష్ట్రంలో రీపోలింగ్ రోజున శాంతిభద్రతలు ఉండేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రీపోలింగ్‌లో మరింత భద్రత కల్పించాలంటూ బీఎస్‌ఎఫ్ తూర్పు కమాండ్ ఐజీకి లేఖ కూడా రాశారు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు