బెంగాల్ : తృణమూల్ నేతను అరెస్ట్ చేయండి.. హింసాత్మకంగా మారిన నిరసనలు , సందేశ్‌ఖాలీలో కర్ఫ్యూ

By Siva Kodati  |  First Published Feb 10, 2024, 4:31 PM IST

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షేక్ షాజహాన్ అతని అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు హింసాత్మక నిరసనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు ఆంక్షలు విధించబడ్డాయి


తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షేక్ షాజహాన్ అతని అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు హింసాత్మక నిరసనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు ఆంక్షలు విధించబడ్డాయి. షాజహాన్ అతని అనుచరులు ‘హిందూ మహిళల’ లైంగిక వేధింపుల నివేదికలను జాతీయ మహిళా కమీషన్ (ఎన్‌సీడబ్ల్యూ) శనివారం పరిగణనలోనికి తీసుకుంది. ఈ విషయంపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరింది. అంతకుముందు .. సందేశ్‌ఖాలీలో నలుగురు లేదా అంతకుమించి ఎక్కువ వ్యక్తులు గుమిగూడటం నిషేధించబడినందున , ఒక బీజేపీ బృందాన్ని ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఆపారు.

గడిచిన మూడు రోజులుగా సందేశ్‌ఖాలీలో స్థానిక మహిళల నేతృత్వంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రేషన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ఇంటిపై దాడి చేయడానికి వెళ్లింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం . గత నెలలో అదృశ్యమైన షాజహాన్‌ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. షాజహాన్ అతని గ్యాంగ్ తమను లైంగికంగా వేధించడమే కాకుండా బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. 

Latest Videos

చేతుల్లో కర్రలు, చీపురులతో స్థానిక మహిళలు సందేశ్‌ఖాలీలోని వివిధ ప్రాంతాల్లో రెండవ రోజు నిరసన తీవ్రతరం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం .. షాజహాన్ సహాయకుడు శోబోప్రసాద్ హజ్రా ఇంటిని ధ్వంసం చేసి ఫర్నిచర్‌ను తగులబెట్టారు. హజ్రాకు చెందిన జెలియాఖలీలోని ఫౌల్ట్రీ ఫారమ్‌కు నిప్పు పెట్టారు. తమ వద్ద నుంచి లాక్కొన్న భూమిలో పొలాలు నిర్మించుకున్నారని.. తమను బలవంతంగా పనిచేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ విధ్వంసానికి సంబంధించి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఐజీ (బరాసత్ రేంజ్) సుమిత్ కుమార్ తెలిపారు. 

 

Protests have erupted across Basirhat’s Sandeskhali. Locals are demanding arrest of dreaded monster Shahjahan Sheikh and his men. But what should shake our collective conscience, is the chilling account of how Shahjahan and his men would abduct young, good looking, married women… pic.twitter.com/OdDCvqN2sX

— Amit Malviya (@amitmalviya)

 

విలేకరుల సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) మనోజ్ వర్మ మాట్లాడుతూ.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరారు. అందిన అన్ని ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టం తమ పని తాను చేసుకుపోతోంది. ప్రస్తుతం పరిస్ధితి అదుపులోనే వుందని మనోజ్ పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న మహిళలు సందేశ్‌ఖాలీ పోలీస్ స్టేషన్ వెలుపల కొన్ని గంటలపాటు బైఠాయించారు. శనివారం తిరిగి నిరసన చేస్తామని రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రదర్శనను విరమించుకున్నారు. 

ఇంతలో షాజహాన్ మద్ధతుదారులు కూడా వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. నిరసన తెలిపిన మహిళల ఆరోపణలపై సత్వర చర్యలు తీసుకోవాలని రెండు రోజుల్లో డీజీపీ సమగ్ర విచారణ నివేదిక ఇవ్వాలని మహిళా, శిశు హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ‘‘ టీఎంసీ పార్టీ కార్యాలయంలో షేక్ షాజహాన్ పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హట్‌లో హిందూ మహిళలను అక్రమంగా నిర్బంధించి అత్యాచారం చేశారని ఆరోపించిన నివేదికల వల్ల ఎన్‌సీడబ్ల్యూ తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ ఘటనను ఖండిస్తున్నామని, సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే జోక్యం చేసుకుని బాధితులకు వైద్యం అందించాలని రాష్ట్ర డీజీపీకి లేఖ పంపారు. తాము 48 గంటల్లో వివరణాత్మక దర్యాప్తు నివేదికను డిమాండ్ చేస్తున్నాం. సభ్యురాలు డెలినా నేతృత్వంలోని ఎన్‌సీడబ్ల్యూ విచారణ కమిటీ ఈ విషయంలో నేరం జరిగిన ప్రదేశానికి వెళ్తుంది ’’ అని కమీషన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.

ఈ ప్రాంతంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు బీజేపీ, సీపీఐఎం ప్రజలను రెచ్చగొడుతున్నాయని టీఎంసీ పేర్కొంది. ఆ ప్రాంతంలో ఒకరిద్దరు టీఎంసీ నేతలపై అసంతృప్తి వుండొచ్చునని.. కుట్రదారులు దానిని సద్వినియోగం చేసుకుని ఇబ్బందులకు గురిచేశారని, ఇది ఒక వివక్ష సంఘటన, ప్రజల మనోవేదనలను పరిష్కరిస్తామని టీఎంసీ అధికారి ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. ఈ ఘటన ప్రజల్లో నెలకొన్న ఆగ్రహానికి ఫలితమేనని బీజేపీ పేర్కొంది. సందేశ్‌ఖాలీలో జరిగిన సంఘటన రాబోయే అంశాలకు ట్రైలర్ ని.. టీఎంసీ పాలన ఇంకెన్నో రోజులు వుండదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తెలిపారు. 

సీపీఎం నేత తన్మోయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. వందలాది ఎకరాల భూములను అక్రమంగా ఆక్రమించడం, పోలీసుల నిర్లక్ష్యం ప్రజల ఆగ్రహానికి దారి తీసిందన్నారు. ఇది రాజకీయం కాదని.. ఆకస్మిక మూక దాడిగా ఆయన అభివర్ణించారు. ఇదిలావుండగా షాజహాన్ అతని మనుషులు.. అందంగా వుండి వివాహితులైన హిందూ మహిళలను వారి ఇళ్ల నుంచి అపహరిస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. మమతా బెనర్జీలో బెంగాల్‌లో హిందూ మహిళలు, షేక్ షాజహాన్ వంటి ముస్లిం పురుషులకు ఓ ఆటలా మారిందన్నారు. ఎందుకంటే ఆమె ముస్లిం ఓట్లకు బదులుగా ఒక మహిళగా తన సున్నితత్వాన్ని తాకట్టు పెట్టిందని మమతపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ సిగ్గుతో తలదించుకోవాలని.. ఆమె ఒక మహిళా ముఖ్యమంత్రిగానే కాదు, మనిషిగా కూడా ఒక మచ్చ అని అమిత్ దుయ్యబట్టారు. 
 

click me!