‘దేశానికి మోదీ బాబా అవసరం లేదు’ : ఏఐఎంఐఎం నేత ఒవైసీ

By SumaBala Bukka  |  First Published Feb 10, 2024, 4:18 PM IST

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ ‘దేశానికి మోదీ బాబా అవసరం లేదని’ 1992 డిసెంబర్‌లో కూల్చివేసిన బాబ్రీ మసీదు కూడా అయోధ్యలోనే ఉంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అని అన్నారు.


ఢిల్లీ : ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాజ్యసభలో పార్లమెంట్ సమావేశాల చివరిరోజున ధన్యవాద తీర్మానాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం "ఒక నిర్దిష్ట సమాజం, మతానికి సంబంధించిన ప్రభుత్వమా? లేక మొత్తం దేశానికి చెందిన ప్రభుత్వమా?" అని ప్రశ్నించారు. దేశానికి మోడీ బాబా అవసరం లేదన్నారు.

పార్లమెంటులో రామమందిర నిర్మాణం, జనవరి 22న 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేస్తూ, "భారత ప్రభుత్వానికి మతం ఉందా?" అని ప్రశ్నించారు. “ఈ దేశానికి మతం లేదని నేను నమ్ముతున్నాను, జనవరి 22 జరిగిన సంఘటనతో ఈ ప్రభుత్వం ఒక మతం.. మరొక మతం గెలిచిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటుందా? దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలకు మీరే సందేశం ఇస్తారు?.. అని ప్రశ్నించారు.

Latest Videos

undefined

2024 ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా

"నేను బాబర్, జిన్నా లేదా ఔరంగజేబు ప్రతినిధినా?... నేను రాముడిని గౌరవిస్తాను. నేను నాథూరామ్ గాడ్సేను ద్వేషిస్తాను.. ఎందుకంటే అతను ‘హే రామ’ అనే చివరిమాటలు పలికి వ్యక్తిని చంపాడు’’ అని ఏఐఎంఐఎం చీఫ్ అన్నారు. మితవాద సంస్థలు అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు, "డిసెంబర్ 6, 1992 తర్వాత దేశంలో అల్లర్లు జరిగాయి" అని గుర్తుచేశారు.

ఆ సమయంలో "యువకులను జైలులో పెట్టారు. వారు వృద్ధులుగా బయటకు వచ్చారు" అన్నారు. ఒవైసీ తన ప్రసంగాన్ని ముగించడానికి, "బాబ్రీ మసీదు జిందాబాద్.. బాబ్రీ మసీదు ఉంది, ఎప్పటికీ ఉంటుంది" అని అన్నారు.

ఈ ఏడాది జనవరి 22న అయోధ్య ఆలయంలో రామ్ లల్లా విగ్రహం 'ప్రాణ్ ప్రతిష్ట' కార్యక్రమం జరిగింది. దశాబ్దాల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు టైటిల్ దావాను 2019లో చారిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పు పరిష్కరించింది. రాముడి జన్మస్థలాన్ని గుర్తించే ఆలయం ఉన్న స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించబడిందని హిందూ న్యాయవాదులు వాదించారు.

click me!