యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవబోమని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే తాము చూస్తూ ఊరుకొంటామా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.
ముంబై: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారం నాడు ఎన్సీపీ చీప్ Sharad Pawar తో ముంబైలో భేటీ అయ్యారు. ఈ బేటీలో ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్, టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.ముంబైలోని ఓ హోటల్ లో బెంగాల్ సీఎం Mamata Banerjee తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేలను కలిసిన మరునాడే ఈ భేటీ జరిగింది. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మమత బెనర్జీ తొలుత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవాల్సి ఉంది. అయితే ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆయన తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను మమత బెనర్జీ కలిశారు.
ఆదిత్య ఠాక్రే తన తండ్రి ఫోటో గ్రాఫ్ ల టేబుల్ బుక్ ను మమత బెనర్జీకి అందించారు. మమత బెనర్జీ ఇవాళ ఉదయం ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయాన్ని సందర్శించారు. 2008 ముంబై ఉగ్రదాడిలో పోరాడి మరణించిన పోలీసు కానిస్టేబుల్ తుకారాం ఓంబాలే స్మారక చిహ్నం వద్ద బెంగాల్ సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసి రావాలని మమత బెనర్జీ కోరారు. ఫాసిస్ట్ Bjp ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆమె కోరారు. UPAది ముగిసిన చరిత్రగా పేర్కొన్నారు.యూపీఏ ఇప్పుడు ఉనికిలో లేదని ఆమె అభిప్రాయపడ్డారు.మరో వైపు టీఎంసీతో తమకు పాత అనుబంధం ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు.
undefined
గోవా, మేఘాలయ, బీహార్, హర్యానా తదితర రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా అవతరించేందుకు టీఎంసీ ప్రయత్నాలు చేస్తోంది. టీఎంసీలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి ఎక్కువ మంది చేరారు. ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోవాలని టీఎంసీ భావిస్తోంది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలవడం తప్పనిసరి అని ప్రశ్నించిన సమయంలో కూడా ఆమె కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలను ఏకం చేసేందుకు మమత బెనర్జీ ప్రయత్నాలపై బీజేపీ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ బలహీన పడిన రాష్ట్రాల్లో ఒకరిద్దరూ రిటైర్డ్ రాజకీయ నాయకులు మమత బెనర్జీ పక్షం వహించే అవకాశం ఉండొచ్చని బీజేపీ నేత ఘోష్ విమర్శించారు.