Murder Plan: ఎమ్మెల్యే హత్యకు మాస్టర్ ప్లాన్.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో.. !

By team teluguFirst Published Dec 1, 2021, 5:26 PM IST
Highlights

ఓ ఎమ్మెల్యేను (MLA) చంపించడానికి అతని ప్రత్యర్థి మాస్టర్ ప్లాన్ (Murder Plan) వేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన హోం మంత్రి.. ఎమ్మెల్యేకు భద్రతను పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పారు.

ఓ ఎమ్మెల్యేను (MLA) చంపించడానికి అతని ప్రత్యర్థి మాస్టర్ ప్లాన్ (Murder Plan) వేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాంగ్రెస్ నేత (Cong leader) గోపాలకృష్ణను బెంగళూరులోని యెలహంక నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్‌ఆర్ విశ్వనాథ్‌ను (BJP MLA SR Vishwanath) చంపడం గురించి మాట్లాడుతన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో‌లో ఎస్‌ఆర్ విశ్వనాథ్‌ హత్యకు గోపాలకృష్ణ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. 

మూడు నిమిషాల నిడివి గల ఈ వీడియో క్లిప్‌లో గోపాలకృష్ణ మరో వ్యక్తి‌ కుల్ల దేవరాజుతో మాట్లాడుతూ.. విశ్వనాథ్‌ హత్య గురించి చర్చించాడు. ఎమ్మెల్యేను చంపేయాలని వారిని కోరాడు. అందుకు కోటి రూపాయలు, అంతకంటే ఎక్కవ ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా తెలిపాడు. అంతేకాకుండా.. ఈ విషయం తమ మధ్యే ఉండాలని, ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండాలని మరో దేవరాజును కోరాడు. ఈ క్రమంలోనే హత్యకు సంబంధించి మాజీ పోలీసు అధికారికి కూడా గోపాలకృష్ణ ఫోన్ చేసిన మాట్లాడాడు. అయితే ఈ సంభాషణ ఎప్పుడు చోటుచేసుకుందనేది మాత్రం తెలియరాలేదు.

గోపాలకృష్ణ మాట్లాడిన వీడియో వైరల్‌ అవ్వడంతో కర్ణాటక పోలీసులు స్పందించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న వారు విచారణ చేపట్టారు. ఇదే అంశంపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర.. మంగళవారం రాత్రి తనకు ఈ వీడియో గురించి తెలిసిందన్నారు. ప్రస్తుతం విశ్వనాథ్‌కు రక్షణ కల్పించడం దృష్టి సారించినట్టుగా చెప్పారు. ఈ అంశాన్ని నిఘా విభాగం నిర్ణయించాల్సి ఉందన్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు. 

మరోవైపు ఇందుకు సంబంధించి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే దేవరాజ్‌, కుల్ల దేవరాజు మాట్లాడుకున్న ఈ వీడియో 5 నెలల క్రితం జరిగిందని అనుమానిస్తున్నారు. దీనిపై ఇప్పటికి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేని, విచారణ ప్రాథమిక దశలో ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారు. 

ఇక, కాంగ్రెస్‌కు చెందిన గోపాలకృష్ణ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో యలహంక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కుల్ల దేవరాజు అనే వ్యక్తి అతని సహచరుడు. 

click me!