తప్పతాగి బస్సు ఎక్కిన కానిస్టేబుల్.. తోటి ప్రయాణికులతో గొడవ.. చివరికి అందరు కలిసి..

By telugu teamFirst Published Dec 1, 2021, 4:36 PM IST
Highlights

పోలీసు కానిస్టేబుల్ అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఫుల్‌గా లిక్కర్ తాగి బస్సు ఎక్కాడు. ఓ చోట కూర్చోవాల్సిందిగా ఆయనకు సూచనలు చేయగా గొడవకు దిగాడు. కండక్టర్ మాటలపై సీరియస్ అయ్యాడు. దీంతో తోటి ప్రయాణికులు కలుగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన దారికి రాలేదు. కండక్టర్ సహా తోటి ప్రయాణికులపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో వారంతా కలిసి ఓ చోట బస్సు ఆపేసి ఆయనను దింపేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నది.
 

చెన్నై: ఓ కానిస్టేబుల్ తప్పతాగి బస్సు ఎక్కాడు. ఎక్కి ఒక చోట కుదురుగానూ కూర్చోలేదు. కూర్చోమని చెప్పినందుకు  కండక్టర్‌పై ఒంటికాలిపై లేచాడు. సర్ది చెప్పవచ్చిన తోటి ప్రయాణికులపైనా కస్సుబస్సులాడాడు. ఎంత వారించినా వినలేదు.మీది మీదికి వెళ్తూ ప్రయాణికులపై దౌర్జన్యానికి దిగాడు. కండక్టర్ చెప్పిన మాటలనూ లక్ష్య పెట్టలేదు. బస్సులో వీరంగం సృష్టించాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

చెన్నై నగరంలో వండలూరు, కోయంబేడు మధ్య 70వీ అనే సిటీ బస్సు నడుస్తుంది. ఈ బస్సులో పోలీసు అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి మద్యం కిక్కుతో బస్సు ఎక్కాడు. కూర్చోమని అడిగినందుకు దౌర్జన్యానికి దిగాడు. తోటి ప్రయాణికులపైనా, కండక్టర్‌పైనా దాడి చేశాడు. ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. తన వైఖరి మార్చుకోలేదు. తనకు సర్ది చెప్పడానికి వస్తున్నవారిని తోసేయడానికి ప్రయత్నించాడు. ఎదుటి వారు చెప్పినది వినే స్థితిలో ఆయన లేరు. అందుకే వారించి వారించి చివరికి ఆయన తీరుపై ప్రయాణికులకు అసహనం పెరిగింది. 

Also Read: అత్తింటివారికి వార్నింగ్? పెళ్లి అలంకరణలో జిమ్‌లో వధువు ఫొటోషూట్ వైరల్.. నెటిజన్ల కామెంట్లు

చివరికి ఒక చోట బస్సు ఆపి ఆయనను బలవంతంగా దింపేశారు. అయితే, ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. వైరల్ కావడం మూలంగా అది అధికారుల కంట పడింది. దీంతో చెన్నై పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు. బస్సులో చిందులు తొక్కిన ఆ నిందితుడిని గుర్తిస్తామని, ఆయనపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

click me!