పశ్చిమబెంగాల్ లో ఒమిక్రాన్ టెన్షన్.. స్కూళ్లు, సినిమా హాళ్లు బంద్, లాక్ డౌన్ తలపించే నిబంధనలు..

By SumaBala Bukka  |  First Published Jan 3, 2022, 4:14 PM IST

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని ఆదేశించారు. అన్ని సమావేశాలు వర్చువల్ గా జరగాలని సూచించారు. ఇప్పటికే కోర్టుల్లో కూడా ప్రత్యక్ష పద్ధతిలో విచారణలు నిలిపివేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటన చేశాయి. అత్యవసరమైతే తప్పా, మిగతా అన్ని కేసులు వర్చువల్ గానే విచారణ జరపనున్నట్లు వివరించాయి. 


పశ్చిమ బెంగాల్ : Corona, Omicron భయాలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో  West Bengal కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. లాక్ డౌన్ తలపించేలా Curbs విధిస్తోంది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్ లు, బ్యూటీ పార్లర్ లు, జూపార్క్ లు మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి H. K. Dwivedi నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు ద్వివేది. 

50 శాతం ఉద్యోగులకే అనుమతి..
దీనితో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని ఆదేశించారు. అన్ని సమావేశాలు వర్చువల్ గా జరగాలని సూచించారు. ఇప్పటికే కోర్టుల్లో కూడా ప్రత్యక్ష పద్ధతిలో విచారణలు నిలిపివేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటన చేశాయి. అత్యవసరమైతే తప్పా, మిగతా అన్ని కేసులు వర్చువల్ గానే విచారణ జరపనున్నట్లు వివరించాయి. 

Latest Videos

undefined

ఒమిక్రాన్ వేవ్ మొదలైంది.. 84శాతం కేసులు కొత్త వేరియంట్‌తోనే.. వారంలో పీక్‌కు.. : ప్రభుత్వం
జనవరి 5 నుంచి విమానాల రాకపోకల మీద కూడా ఆంక్షలు విధించనుంది బెంగాల్ ప్రభుత్వం. వారానికి రెండు రోజులు మాత్రమే ఢిల్లీ, ముంబైలకు విమానాల రాకపోకలు నిర్వహించేలా చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాలకు అనుమతి రద్దు చేసింది బెంగాల్ ప్రభుత్వం. 

రవాణా సదుపాయాలపైనా ఆంక్షలు...
నగరాల్లో లోకల్ ట్రైన్లలో కూడా 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అది కూడా రాత్రి 7 గంటలవరకే నడవాలని ఆదేశించింది. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల టైమింగ్స్ సామర్థ్యాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ప్రభుత్వం.

ఇదిలా ఉండగా, దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలలో అత్యధికంగా ఈ వేరియంట్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఢిల్లీలో నమోదయ్యే మొత్తం కేసుల్లో కెల్లా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. సోమవారం ఈ విషయమై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని వివరించారు. 

డిసెంబర్ 30, 31వ తేదీల్లోని జీనోమ్ సీక్వెన్సింగ్ వివరాలు పరిశీలిస్తే.. ఢిల్లీలో నమోదు అవుతున్న మొత్తం కేసుల్లో 84 శాతం కొత్త వేరియంట్ కేసులే ఉన్నట్టు అర్థం అవుతున్నదని తెలిపారు. అంటే.. ఢిల్లీలో ఒమిక్రాన్ కారణంగా కొత్త వేవ్ ప్రారంభమైందని అన్నారు. అంతేకాదు, ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఆరు శాతానికి పెరిగిందని చెప్పారు. వారం రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో కేసులు పీక్ స్థాయికి వెళ్లవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు వివరించారు.

ఢిల్లీలో గత నెల చివరి వారం నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఢిల్లీలో 7,277 కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ స్థాయిలో కేసులు గత జూన్‌లో నమోదయ్యాయి. జూన్‌లో ఢిల్లీలో కేసులు 7,948 కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ నెలలో రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి.

click me!