
ముంబయి: రైల్వే ట్రాక్(Railway Track)పై ఆత్మహత్యలు(Suicide) చాలా మందిని కలచివేసేవి. మనిషి కనిపించగానే ట్రైన్‌ను లోకో పైలట్(Loco Pilot) ఆపడం చాలా కష్టమైన పని. అందుకే చాలా మంది ట్రాక్‌పై ఆత్మహత్యలను ఆపడానికి ప్రయత్నించినా చాలా సార్లు సాధ్యపడక పోయేవి. అయితే, మహారాష్ట్రలో ఓ లోకో పైలట్‌గా అప్రమత్తంగా ఉండి.. వేగంగా స్పందించి ట్రైన్‌కు ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో ట్రాక్‌పై ఆత్మహత్యం చేసుకోవాలనే ఉద్దేశంతో పడుకుని ఉన్న వ్యక్తి దగ్గరకు ఆగి ఆ ట్రైన్ ఆగిపోయింది. ఆత్మహత్యా యత్నం చేసిన వ్యక్తి దగ్గరకు వచ్చి ట్రైన్ ఆగిపోయిన దృశ్యాలు అక్కడ అమర్చిన ఓ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. రైల్వే శాఖ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. చాలా మంది ఆ మోటార్ మాన్‌ను అభినందించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబయికి సమీపంలోని శివ్రి పోలీసు స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై తచ్చాడుతూ ఆ వీడియోలో కనిపించాడు. అటూ ఇటూ తిరుగుతూ.. చివరి ట్రాక్‌పై ట్రైన్ వస్తుండగా.. వెంటనే ఆయన ఆ ట్రాక్‌పై పడుకున్నాడు. ఓ ట్రాక్‌పై నడము వరకు పడుకుని తల వైపు భాగాన్ని బయటకు ఉంచాడు. ట్రైన్ అతడి మీద నుంచి వెళ్లితే రెండు ముక్కలు అయ్యేవాడు. కానీ, ఆ ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్ ఎదురుగా ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నాడని గ్రహించాడు. అంతే వేగంగా అలర్ట్ అయి.. ట్రైన్‌కు ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. ఇంకేముంది.. తనపై నుంచి వెళ్తుందనుకున్న ట్రైన్ తనకు కొంత దూరంలో నిలిచిపోయింది. బహుశా ఆయన కళ్లు మూసి ఉన్నాడేమో.. ట్రైన్ అక్కేడ ఆగి ఉన్నా ట్రాక్‌పై నుంచి లేవలేదు.
Also Read: చిన్నారి మీద దూసుకెళ్లిన రైలు.. క్షేమంగా బయటపడ్డ బుడతడు
ముగ్గురు పోలీసులు వెంటనే అతడి వైపు పరుగెత్తారు. పరుగెత్తి ఆయనను ఎస్కార్ట్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తెచ్చారు. ఈ ఘటనను వివరించే 50 సెకండ్ల క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వీడియోలో కనిపిస్తున్న వివరాల ప్రకారం, జనవరి 2వ తేదీ ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ వీడియోను ట్వీట్ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఇలా ట్వీట్ చేసింది. మోటార్ మాన్ అద్భుత కార్యం చేశాడని, సకాలంలో అప్రమత్తమై ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్న వ్యక్తి ప్రాణాలను కాపాడగలిగాడని పేర్కొంది. ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేసి ఈ పని చేయగలిగాడని వివరించింది. ‘మీ ప్రాణం విలువైనది. ఇంటి వద్ద మీ కోసం ఎవరో ఒకరు వేచి చూస్తు ఉంటారు’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ ఆ మోటార్ మ్యాన్ ఒక కుటుంబాన్నే కాపాడారని ప్రశంసలు కురిపించారు. ఇంకొందరు ఆయన పేరు కూడా వెల్లడించాల్సిందని, అలాంటి హీరోలకు ప్రచారం లభించాలని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఆ వ్యక్తిని కాపాడటానికి వెళ్లిన పోలీసులనూ అభినందించాల్సిందేనని పేర్కొన్నారు. కాగా, ఇంకొందరు నెటిజన్లు ఆ లోకో పైలట్‌కు సెల్యూట్ కొట్టారు.