
లక్నో : uttarpradesh లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ doctorని షూట్ చేసిన నేరం కింద ఇద్దరు యువకులను పోలీసులు arrest చేశారు. డాక్టర్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై డాక్టర్ ప్రయాణిస్తున్న సమయంలో నిందితులు firing జరిపారు. ప్రధాన నిందితుడు బాధితుడిని నకిలీ డాక్టర్ అంటూ ఆరోపణలు చేశాడు. ఈ ఉదంతంపై పోలీసులు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు.
నంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేఖుపుర గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు సల్మాన్, అతని భార్యకు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఐతే చికిత్స పొందుతూ అతని భార్య ప్రాణాలు కోల్పోవడంతో, కోపోద్రిక్తుడైన సల్మాన్ అదును చూసి అతని బార్యకు వైద్యం చేసిన డాక్టర్ తిలక్ రామ్ మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కాగా, ఈ విషయం మీద పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ధరమ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. నంగల్ పోలీస్ స్టేషన్ లోని షేకుపురా గ్రామానికి చెందిన ఫార్మసిస్ట్ డాక్టర్ తిలక్ రామ్ ను డిసెంబర్ 30న సాయంత్రం సల్మాన్, మెహబూబ్ అనే మరో వ్యక్తితో కలిసి డాక్టర్ మీద కాల్పులు జరిపారు. గాయాలపాలైన డాక్టర్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ కేసులో నిందితులైన సల్మాన్, మెహబూబ్ ల మీద బాధితుడి సోదరుడు కాల్పుల కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు.
Lakhimpur Kheri case: ఆశిష్ మిశ్రానే ప్రధాన నిందితుడు, 5 వేల పేజీలతో చార్జీషీట్ దాఖలు
ఇదిలా ఉండగా, Online games వ్యసనం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. సరదాగా మొదలై వ్యసనంగా మారి...అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల నిండు జీవితాలు మొదలు కాకుండానే ఆగిపోయేలా చేశాయి. ఏ పనీ చేయకుండా, గేమ్ లకు బానిసై, అప్పులపాలై.. భార్య, పిల్లలు ఉసురు తీశాడో వ్యసనపరుడు. ఈ విషాద ఘటన Tamil Naduలో కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే...
ఆన్లైన్ గేమ్ లకు బానిసై పనికి వెళ్లకుండా, అప్పుల పాలైన ఓ వ్యక్తి… భార్య, ఇద్దరు పిల్లలను Murderచేసి Suicideకు పాల్పడ్డారు. ఈ ఘటన చెన్నైలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పెరుంగుడి పెరియార్ లోని ఓ అపార్ట్మెంట్లో మణికంఠన్ (36), తార(35) దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారులు ధరణ్ (10), దహాన్ (1) ఉన్నారు.
కోయంబత్తూర్ కు చెందిన మణికంఠన్ ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. రెండు నెలలుగా పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆన్లైన్ లో నగదు పెట్టి గేమ్ లు ఆడుతూ అప్పుల పాలయ్యాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. డిసెంబర్ 31న రాత్రి ఘర్షణ కూడా పడ్డారు. ఈ క్రమంలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి మణికంఠన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటి తలుపులు మూసి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.