వరుడికి కరోనా.. పెళ్లి ఆపడం ఇష్టంలేక..

By telugu news teamFirst Published Apr 10, 2021, 11:16 AM IST
Highlights

ఈ మహమ్మారి కారణంగా మళ్లీ పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. అయితే జమ్ముకశ్మీర్‌లోని రన్సూకు చెందిన మనీర్ దీనికి ఒక పరిష్కారం మార్గం చూపాడు. 
 

కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో.. తన, పర అనే బేధం లేకుండా.. అందరినీ ఈ వైరస్ చుట్టుముడుతోంది. ఈ మహమ్మారి కారణంగా మళ్లీ పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. అయితే జమ్ముకశ్మీర్‌లోని రన్సూకు చెందిన మనీర్ దీనికి ఒక పరిష్కారం మార్గం చూపాడు. 

కరోనా సోకిన వరుడు మనీర్ హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ, బంధార్‌లో ఉంటున్న వధువు రజియాతో వీడియో కాల్ ఆధారంగా వివాహం చేసుకున్నాడు. మౌల్వీ వీరిద్దరికీ వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో వధువును యధావిధిగా అత్తవారింటికి పంపారు. మనీర్ ఆరోగ్యం కుదుట పడగానే రజియా భర్త దగ్గరకు చేరుకోనుంది. 

వివరాల్లోకి వెళితే మనీర్, రజియాలకు ఏప్రిల్ 8న వివాహం నిశ్చయించారు. అయితే ఇంతలో మనీర్‌కు కరోనా సోకింది. అయితే ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమయానికే వివాహం జరగాలని మనీర్ నిశ్చయించుకున్నాడు. దీంతో ఆన్‌లైన్‌లో మౌల్వీ సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా... వీరి ఆన్ లైన్ పెళ్లి పద్దతి అందరినీ ఆకట్టుకుంటుంది. 

click me!