
మధ్యప్రదేశ్ లో కరోనా కేసలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా వైద్యులు, వైద్య విద్యార్థులు కూడా కరోనాబారిన పడుతున్నారు. భోపాల్ ఎయిమ్స్ లో పనిచేస్తున్న వైద్యులతో పాటు విద్యార్థులు.. మొత్తం 53 మందికి కరోనా సోకింది.
వీరిలో ఇద్దరు వైద్యులు కాగా, ఆరుగురు రెసిడెంట్ డాక్టర్లున్నాయి. 83 మంది వైద్య విద్యార్థులు, 13 మంది హెల్త్ కేర్ వర్కర్లు ఉన్నారు. కాగా సోషల్మీడియాలో భోపాల్ ఎయిమ్స్ లో 102మంది వైద్యులు కరోనా బారిన పడినట్లు వస్తున్న వార్తలను ఎయిమ్స్ అధికారులు ఖండించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే కరోనా మహమ్మారి నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిండ్వారా జిల్లాలోని పట్టణ ప్రాంతాలు, రత్లం నగరం, ఖార్గోన్లతో సహా నాలుగు జిల్లాల్లో సర్కారు లాక్‌డౌన్ విధించింది.
కరోనా కేసుల కట్టడి కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఏప్రిల్ 5వతేదీ ఉదయం 6 గంటల నుంచి లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిండ్వారా జిల్లాలోని పట్టణ ప్రాంతాలు, రత్లం నగరం, ఖార్గోన్లతో సహా నాలుగు జిల్లాల్లో సర్కారు లాక్‌డౌన్ విధించింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి చిండ్వారాలో లాక్‌డౌన్ విధించారు.
బేతుల్ జిల్లా, ఖార్గోన్ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం 8 గంటల నుంచి లాక్‌డౌన్ విధించారు.కరోనా కేసులు అధికంగా నమోదైన నాలుగు జిల్లాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందాలను పంపినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.
పెరుగుతున్న కరోనా కేసులు.. నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్...
మహారాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన చిండ్వారాలో కరోనా వైరస్ కేసులను నియంత్రించడానికి మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు.ప్రజలు కొవిడ్ టీకాలు వేయించుకోవడంతోపాటు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 2వతేదీన 961 కరోనా కేసులు నమోదైనాయి. మొత్తం 18,057 కరోనా క్రియాశీల కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 12 మంది మరణించారు.