Right To Dress: మహిళా టీచర్లు చీరలే కట్టుకోవాలా?.. కేరళ ప్రభుత్వ నిర్ణయమిదే

By telugu teamFirst Published Nov 13, 2021, 2:29 PM IST
Highlights

మహిళా టీచర్లు కచ్చితంగా చీరే కట్టుకుని విద్యా సంస్థకు రావాలనే నిబంధన చాలా పాతకాలం నాటిదని, దానికి కాలం చెల్లిందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్ బిందు వివరించారు. తమకు సౌకర్యవంతమైన దుస్తులను ధరించే నిర్ణయం వారి వ్యక్తిగతమైనదని, ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఇతరులకు లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరోసారి సర్క్యూలర్ జారీ చేయనున్నట్టు వివరించారు.
 

తిరువనంతపురం: సాధారణంగా మహిళా టీచర్లు చీరలు కట్టుకోవడం ఎక్కువగా అమల్లో ఉన్న సంప్రదాయం. అయితే, వారు చీరలే(Sarees) కట్టుకోవాలా? అసభ్యంగా లేని.. వారికీ సౌకర్యంగా ఉన్న ఇతర దుస్తులు ధరిస్తే తప్పేంటి? అనే చర్చ కూడా జరుగుతున్నది. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో బాధ్యతలు ఉంటాయని, అలాంటప్పుడు తమ సౌకర్యానికి అనుకూలంగా ఉండే ఇతర డ్రెస్‌లు వేసుకుంటే తప్పేంటి? అని కొందరు మహిళా ఉపాధ్యాయులు(Women Teachers) ప్రశ్నిస్తున్నారు. ఉన్న బాధ్యతలకు తోడు.. చీర కట్టుకోవాలనే బాధ్యత కూడా ఎందుకు మోపడం అంటూ అడుగుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులపైనే కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Kerala అభ్యుదయ భావాలకు మహిళా టీచర్లు కచ్చితంగా చీరలే కట్టుకోవాలనే తీరు సరికాదని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్ బిందు స్పష్టం చేశారు. ఎవరికైనా తమకు ఇష్టమైన డ్రెస్ ధరించే Right ఉంటుందని తెలిపారు. అందులో జోక్యం చేసుకునే హక్కు ఇతరులకు లేదని వివరించారు. దీనికి సంబంధించి ఉన్నత విద్యా శాఖ శుక్రవారం ఓ సర్క్యూలర్ జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా విద్యా సంస్థలు మహిళా టీచర్లు చీరలు కట్టుకోవాలనే నిబంధననే అమలు జరుపుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని వివరించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు తన వైఖరిని స్పష్టం చేసి ఉన్నదని తెలిపింది.

Also Read: తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారిపై కేరళ సీఎం సస్పెన్షన్ వేటు.. కారణమిదే..!!

కేరళలో మహిళా టీచర్లు వారికి సౌకర్యంగా ఉన్న.. వారికి ఇష్టమైన డ్రెస్ ధరించే హక్కు ఉన్నదని ఆ సర్క్యూలర్ స్పష్టం చేసింది. వారు ఏ విద్యా సంస్థలో పని చేసినా ఇది వర్తిస్తుందని వివరించింది. అంతేకానీ, మహిళా టీచర్లు చీరలే కట్టుకోవాలనే నిబంధనను మోపడం కేరళ అభ్యుదయ వైఖరికి విరుద్ధమని ఉన్నత విద్యా శాఖ మంత్రి బిందూ ఓ ప్రకటనలో వివరించారు. మంత్రి బిందూ గతంలో కేరళ త్రిస్సూర్‌లోని వర్మ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. తాను ప్రొఫెసర్‌గా బాధ్యతల్లో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా చుడీదార్ ధరించేవారని తెలిపారు.

టీచర్లకు ఎన్నో బాధ్యతలుంటాయని, వాటిలో ఈ అనవసరమైన బాధ్యతనూ మోపడం సరికాదని మంది బిందూ తెలిపారు. మహిళా టీచర్లు చీరలే కట్టుకోవాలనే ఆనవాయితీ పురాతనమైనదని, దానికి కాలం చెల్లిందని అన్నారు. ఏది ధరించాలనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనదని, ఇందులో ఇతరులకు జోక్యం కల్పించుకునే హక్కు లేదని తెలిపారు. 2014లోనూ దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో చాలా విద్యా సంస్థలో అదే ఆనవాయితీని బలవంతంగా అమలు చేస్తున్నారని తమకు తెలియవచ్చిందని, అందుకే మరోసారి ఉన్నత విద్యాశాఖ ఈ సర్క్యూలర్ జారీ చేస్తుందని అన్నారు.

Also Read: ఒకవైపు పద్మ శ్రీ అవార్డు స్వీకరణ.. మరోవైపు భార్య అంత్యక్రియలు.. రచయిత బాలన్ పుతేరి ఏమన్నారంటే..?

ఇటీవలే కొడుంగల్లూర్‌లోని ఓ విద్యా సంస్థలో ఓ యువ లెక్చరర్‌తో తాను మాట్లాడారని మంత్రి బిందు తెలిపారు. ఆమెకు అన్ని అర్హతలున్నా.. చీర కట్టుకుని వస్తేనే ఆ విద్యా సంస్థలో పని చేయడానికి అనుమతి ఇస్తామని సిబ్బంది ఆదేశించిందని తెలిసిందని అన్నారు. ఇలాంటి ఘటనలే మరిన్ని బయటకు వచ్చాయని తెలిపారు. అందుకే మరోసారి సర్క్యూలర్ జారీ చేస్తున్నట్టు వివరించారు.

click me!