గుజరాత్ ఎన్నికల్లో గెలిచి తీరుతాం.. ఆప్ గాలిలోనే ఉంది, నేలపై లేదు - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Published : Oct 31, 2022, 04:53 PM IST
గుజరాత్ ఎన్నికల్లో గెలిచి తీరుతాం.. ఆప్ గాలిలోనే ఉంది, నేలపై లేదు - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

సారాంశం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆప్ మీడియాకు ప్రకటనలు ఇచ్చి రాష్ట్రంలో బలంగా ఉందని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం ప్రకటనల ఆధారంగానే రాష్ట్రంలో సంచలనం సృష్టించిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గుజరాత్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని అన్నారు.

దేశ‌ ఐక్యత విచ్చిన్నానికి శ‌త్రు కుట్ర‌లు.. మ‌నం ఐక్యంగా నిల‌బ‌డాలి: ప్రధాని మోడీ

‘‘గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ సమర్థవంతంగా పోటీ చేస్తోంది. ఆప్ గాలిలో మాత్రమే ఉంది. దానికి నేలపై ఎలాంటి స్థలం లేదు. గుజరాత్‌లో కాంగ్రెస్ పటిష్టమైన పార్టీ, ” అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆప్ ఇచ్చిన ప్రకటనల ఆధారంగా మీడియా సంచలనం సృష్టించిందని అన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన పార్టీగా ఉందని తెలిపారు. అక్కడ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏ ఫర్ అర్జున్.. బీ ఫర్ బలరామ్.. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌కు కొత్త ట్రెండ్.. సోషల్ మీడియాలో ప్రశంసలు

మోర్బిలో వంతెన కూలి 130 మందికి పైగా మరణించిన విషాదంపై వ్యాఖ్యానించడానికి రాహుల్ గాంధీ నిరాకరించారు. ఈ ఘటనను రాజకీయం చేయకూడదని అన్నారు. తెలంగాణ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండబోదని ఆయన కుండబద్దలు కొట్టారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకం అని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అవినీతి వైఖరి తమకు ఆమోదయోగ్యం కాదని, వారు చేస్తున్న పనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడంపై అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. తెలంగాణ సీఎం జాతీయ లేదా అంతర్జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నట్లు ఊహించుకోవచ్చని అన్నారు.

టీఎంసీకి న్యాయ వ్యవస్థపై గౌరవం లేదు.. మమతా బెనర్జీ పై ఎదురుదాడికి దిగిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు 

ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో ఎన్నికల సంఘం గుజరాత్ షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే పోలింగ్ తేదీని ప్రకటించింది. అయితే గుజరాత్‌లో నవంబర్ లేదా డిసెంబర్‌లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే బీజేపీ కూడా మరో సారి అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా 2001 నుండి 2014 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధాని అయ్యారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu