
పిల్లలు సాధారణంగా ఆంగ్ల అక్షరమాలలో A for Apple, B for Boy.. అని చదవుతారు.. ఇకపై పిల్లలు A for Arjun మరియు B for Balaram అని చదివిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఈ తరహాలో ఆంగ్ల అక్షరమాల ఉపాధ్యాయుల సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో A నుంచి Z వరకు గల పదాలు భారతీయ పౌరాణిక సంస్కృతి, చరిత్ర నుండి తీసుకోబడ్డాయి. ఇది పిల్లలకు భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని, బాల్యంలోనే భారతీయ సంస్కృతితో పరిచయం పొందడానికి వీలు కల్పిస్తుందని ఉపాధ్యాయులు కూడా నమ్ముతారు.
ఈ విధమైన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ పీడీఎఫ్ ఫైల్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. ఆయా పదాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. సంబంధిత పదంతో పాటు వివరణ కూడా ఇవ్వబడింది. ఈ విధమైన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ పీడీఎఫ్ ఫైల్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటుంది.
ఇక, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌కు సంబంధించిన ఇటువంటి పదజాలం సీతాపూర్‌కు చెందిన ఒక న్యాయవాది తయారు చేశారు. అమీనాబాద్ ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌ఎల్ మిశ్రా మాట్లాడుతూ.. న్యాయవాది దీన్ని తయారు చేశారని, అయితే దాని గురించి ఆయన మీడియా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రచురణకర్తలు కూడా ఈ కొత్త కాన్సెప్ట్‌ను ఇష్టపడుతున్నారు. మీరట్‌కు చెందిన ఒక ప్రచురణకర్త.. ఈ విధమైన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌ను ప్రచురించాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో పదాలకు సంబంధించిన వర్ణనలు.. మరింత వివరంగా అందించడం వల్ల పిల్లలకు కొంచెం ఎక్కువ సమాచారం లభిస్తుందని ఎస్‌ఎల్ మిశ్రా అన్నారు. ఈ విధానాన్ని రూపొందించిన న్యాయవాది హిందీ వర్ణమాల పదజాలాన్ని కూడా సిద్ధం చేస్తున్నారని తెలిపారు.