బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి అన్నారు. గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉండటం వల్లే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు.
బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ లోని ఫిలిభిత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికింది. ఇటీవల బీజేపీ విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో వరుణ్ గాంధీకి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చారు. వరుణ్ గాంధీ తమ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
విడిపోయిన భారత్-పాక్ లెస్బియన్ జంట.. పెళ్లికి కొన్ని వారాల ముందు నిర్ణయం..
గాంధీ కుటుంబంలోని మూలాలు ఉండటం వల్లే వరుణ్ గాంధీని బీజేపీ ఎన్నికల రేసు నుంచి తప్పించడానికి కారణమని చౌధురి ఆరోపించారు. అందుకే ఆయనను కాంగ్రెస్ లో చేరాలని కోరుతున్నానని అన్నారు. ‘‘ఆయన చేరితే సంతోషిస్తాం. ఆయన పెద్ద నాయకుడు, బాగా చదువుకున్న రాజకీయ నాయకుడు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. గాంధీ కుటుంబంతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. వరుణ్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాలని మేము కోరుకుంటున్నాము’’ అని అధీర్ చౌధురి అన్నారు.
If Varun Gandhi joins Congress Party welcome - Adhir Ranjan Chaudhary
It's mean Varun Gandhi joining Congress Party? pic.twitter.com/1Ey25Tf7WY
కాగా.. బీజేపీ ఆదివారం తన ఐదో లోక్ సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీని తొలగించింది. అయితే సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి ఆయన తల్లి మేనకాగాంధీని పార్టీ నిలబెట్టింది. 2021లో బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాదను ఈ సారి వరుణ్ గాంధీ స్థానంలో ఫిలిభిత్ నుంచి బరిలోకి దింపారు.