
కాలం చెల్లిన మరో 65 చట్టాలను రద్దు చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దానికి సంబంధించిన బిల్లును ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడుతామని ఆయన స్పష్టం చేశారు. గోవాలో జరిగిన 23వ కామన్ వెల్త్ లా కాన్ఫరెన్స్ లో మంత్రి ప్రసంగిస్తూ.. భారతదేశంలోని వివిధ కోర్టుల్లో 4.98 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ పెండింగ్ కేసులను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కరిస్తామని చెప్పారు. కాగిత రహిత న్యాయవ్యవస్థ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. మనీస్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు..
నేడు దేశంలో ప్రతీ పౌరుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో లబ్దిపొందుతున్నాడని కిరెన్ రిజిజు అన్నారు. సంక్షేమ రాజ్యంగా ప్రతీ ఒక్కరి మాట వినడం చాలా ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా సాధారణ పౌరుల జీవన సౌలభ్యం కల్పించడంలో మోడీ ప్రభుత్వం ముందంజలో ఉందని రిజిజు తెలిపారు. జీవన సౌలభ్యం విషయంలో ప్రభుత్వ విధానాలు విజయవంతమయ్యాయన్నారు.
చట్టాలు ప్రజల కోసమేనని ప్రభుత్వం విశ్వసిస్తుందని, చట్టాలు అడ్డంకిగా మారి ప్రజల జీవితాలపై భారంగా మారితే అలాంటి నిబంధనలను తొలగించాల్సి ఉంటుందని అన్నారు. గత ఎనిమిదిన్నరేళ్లలో కాలం చెల్లిన, పనికిరాని 1,486 చట్టాలను తొలగించామని ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో కాలం చెల్లిన మరో 65 బిల్లులు (చట్టాలు), ఇతర నిబంధనలను తొలగించే బిల్లును ప్రవేశపెడతానని చెప్పారు.
పిల్లలు తనను చూడడంలేదని.. కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన 85 ఏళ్ల వృద్ధుడు..
భారతదేశంలోని వివిధ కోర్టుల్లో 4 కోట్ల 98 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అన్నారు. కొత్త కేసుల సంఖ్య రెట్టింపు అయినంత మాత్రాన పెండింగ్ ను తగ్గించడం అంత సులువు కాదని, భారత న్యాయమూర్తులు అసాధారణంగా కష్టపడుతున్నారని, అయితే ఇది మరింత సవాలుగా మారుతోందని చెప్పారు. సాధారణ పరిస్థితుల్లో ఒక న్యాయమూర్తి రోజుకు సగటున 50-60 కేసులను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు. అయితే కొంతమంది న్యాయమూర్తులు ఒక రోజులో 200 కేసులను పరిష్కరించారని, కానీ పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని రిజిజు చెప్పారు. ‘‘ మేము ఈ-కోర్టులు, ప్రత్యేక ప్రాజెక్టులు - ఫేజ్ 3ను ప్రారంభించాం. భారత న్యాయవ్యవస్థను కాగిత రహితంగా మార్చడమే మా అంతిమ లక్ష్యం. మధ్యవర్తిత్వం వంటి ఇతర వివాద పరిష్కార యంత్రాంగాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది’’ అని ఆయన చెప్పారు. దేశంలో మధ్యవర్తిత్వం వ్యవస్థీకృతం అయ్యేలా మధ్యవర్తిత్వ బిల్లును అతి త్వరలోనే తీసుకువస్తామని రిజుజు స్పష్టం చేశారు. కాగా.. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవానికి గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 52 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.