పిల్లలు తనను చూడడంలేదని.. కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన 85 ఏళ్ల వృద్ధుడు..

Published : Mar 06, 2023, 02:15 PM IST
పిల్లలు తనను చూడడంలేదని.. కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన 85 ఏళ్ల వృద్ధుడు..

సారాంశం

తన ఆస్తి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చాడో  85 ఏళ్ల వ్యక్తి.  కోటిన్నర విలువైన ఆస్తిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాస్తూ వీలునామా చేశాడు.

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో ఓ తండ్రి కన్నపిల్లల మీద కఠిననిర్ణయం తీసుకున్నాడు. వారు తనను నిర్లక్ష్యం చేసినందుకు తన ఆస్తి మొత్తాన్ని యూపీ ప్రభుత్వానికి రాసిచ్చాడు. 85యేళ్ల వయసులో ఓ కొడుకు, నలుగురు కూతుర్లు ఉండి కూడా తనను పట్టించుకోవడం లేదని ఈ నిర్ణయానికి వచ్చాడు. అంతేకాదు. నాథూ సింగ్ అనే ఆ పెద్దాయన తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేశాడు  తన కొడుకు, నలుగురు కుమార్తెలను తన అంత్యక్రియలకు హాజరుకానివ్వకూడదని చెప్పాడు.

ముజఫర్‌నగర్‌లో నివసిస్తున్న నాథూ సింగ్‌కు రూ.1.5 కోట్ల విలువైన ఇల్లు, స్థలం ఉంది. అతనికి ఒక కొడుకు ఉన్నాడు, అతను స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. సహరాన్‌పూర్‌లో నివసిస్తున్నాడు. నలుగురు కుమార్తెలున్నారు. వారందరికీ వివాహాలయ్యాయి. భార్య చనిపోవడంతో వృద్ధుడు ఒంటరిగా ఉంటున్నాడు. ఏడు నెలల క్రితం స్వగ్రామంలోని ఓ వృద్ధాశ్రమంలో చేరాడు. అయితే 85 ఏళ్ల ఆ వృద్ధుడిని చూడడానికి ఇంత పెద్ద కుటుంబం ఉన్నా కూడా ఎవ్వరూ రాకపోవడంతో తీవ్ర మనస్థానికి గురయ్యాడు.

ఒడిశాలో ఘోర ప్రమాదం.. బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు.. నలుగురు మృతి

వృద్ధాశ్రయంలో చేరి 7 నెలలు అయినా ఒక్కరూ తండ్రి బాగోగులు కనుక్కోవడానికి రాలేదు. దీంతో ఆవేదన చెందిన అతను తన ఇల్లు, భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి వీలునామా రాశాడు, తాను మరణించిన తర్వాత ఆ స్థలంలో ఆసుపత్రి లేదా పాఠశాలను నిర్మించమని కోరాడు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ "ఈ వయస్సులో, నేను నా కొడుకు, కోడలితో కలిసి జీవించాలి, కానీ వారు నన్ను బాగా చూసుకోలేదు. అందుకే ఆస్తిని బదిలీ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. "

తాను చనిపోయిన తరువాత కూడా తన శరీరం ఉపయోగపడాలనుకున్నాడు. అందుకే మెడికల్ విద్యార్థుల పరిశోధన, అకడమిక్ పనుల కోసం తన శరీరాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా వీలునామాలో ఉంది. ఇంత జరిగినా నాథూ సింగ్‌ కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఇంకా రాలేదని వృద్ధాశ్రమం మేనేజర్ రేఖా సింగ్ అన్నారు. నాథూ సింగ్‌ ఆరు నెలల క్రితం తమ ఆశ్రమంలో చేరారి అప్పటి నుండి ఎవరూ వృద్ధుడిని చూడడానికి రాలేదని... దీంతో అతను ఎప్పుడూ చాలా బాధపడుతుండేవాడని.. ఇటీవల ఆ బాధ మరింత ఎక్కువై తన ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసివ్వడానికి మొండిపట్టు పట్టాడని తెలిపారు. మిస్టర్ సింగ్ అఫిడవిట్ తమకు అందిందని, ఆయన మరణానంతరం అది అమల్లోకి వస్తుందని ఆ ప్రాంతం సబ్-రిజిస్ట్రార్ తెలిపారని మీడియా కథనాలు వెలువడ్డాయి. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu