దేశంలో ఏడాదికి సరిపోను ఆహారధాన్యాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Apr 14, 2020, 12:34 PM IST
అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే లాక్ డౌన్ ను మరింత పొడిగించినట్టుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.మంగళవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మరింత కఠినంగా లాక్‌డౌన్ ను అమలు చేస్తామన్నారు.
 


న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే లాక్ డౌన్ ను మరింత పొడిగించినట్టుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.మంగళవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మరింత కఠినంగా లాక్‌డౌన్ ను అమలు చేస్తామన్నారు.

ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఐదు కంటే తక్కువ కేసులు ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ పై మినహయింపు ఇవ్వనున్నట్టుగా ఆయన తెలిపారు. అంతేకాదు అసలు కరోనా కేసులు లేని జిల్లాలకు లాక్ డౌన్ మినహాయింపు ఇచ్చే విషయంలో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామన్నారు.

also read:స్వగ్రామంలో తల్లి వర్ధంతికి దూరం:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లాక్ డౌన్ కష్టాలు

నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా మంత్రి తెలిపారు. సంవత్సరానికి సరిపడు ఆహార ధాన్యాల నిల్వలు దేశంలో ఉన్నాయని కిషన్ రెడ్డి ప్రకటించారు. 

సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.  నిత్యావసర సరుకుల కోసం  బయటకు వెళ్లే సమయంలో సామాజిక దూరాన్ని పాటించాల్సిందిగా కోరారు. 
also read:లాక్ డౌన్ పొడగింపు, మే 3 వరకు ఎక్కడివాళ్లు అక్కడే:మోడీ

కరోనా రోగులకు సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికి రక్షణ ఉండాలని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి కోరారు. కరోనాపై పోరాటంలో మనం విజయం సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని వారి స్వంత గ్రామాలకు తరలించే విషయమై ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకొంటామన్నారు.
click me!