ముంబయి మురికివాడలో విజృంభిస్తున్న కరోనా

By telugu news team  |  First Published Apr 14, 2020, 11:45 AM IST
ఈ ప్రాంతంలో కొత్తగా  ఆరుగురికి కరోనా సోకగా, ఇద్దరు మరణించారని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ పేర్కొంది. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు ధారావిలో మొత్తం 55 మందికి కరోనా సోకగా, ఏడుగురు మృతిచెందారు. 

ముంబయి మురికివాడలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికి వాడ అయిన ముంబయి ధారావి ప్రాంతంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈ ఘటన తీవ్రంగా కలవరం రేపుతోంది.

దాదాపు 15 లక్షల మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో కొత్తగా ఆరుగురికి కరోనా సోకగా, ఇద్దరు మరణించారని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ పేర్కొంది. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు ధారావిలో మొత్తం 55 మందికి కరోనా సోకగా, ఏడుగురు మృతిచెందారు.

ఇప్పటికే ధారవి చుట్టూ బారికేడ్‌లు ఏర్పాటు చేసిన అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఐసోలేషన్, క్వారంటైన్‌ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో అత్యంత సమీపంలో ఇళ్లు ఉండటంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటే దాన్ని నిరోధించడం కష్టమైన పని అని అధికారులు ఆందోళన చెందుతున్న వేళ కొత్తగా కరోనా కేసులు నిర్ధారణ కావడం అలజడి రేపుతోంది.
click me!