పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించిన ముర్ము

By narsimha lodeFirst Published Jan 31, 2023, 11:13 AM IST
Highlights

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు  ఇవాళ ప్రారంభమయ్యాయి.  పార్లమెంట్  ఉభయసభలనుద్దేశించి రాష్ట్ర పతి  ద్రౌపది ముర్ము  ప్రసంగించారు.  
 

న్యూఢిల్లీ: రాబోయే  25 ఏళ్లు దేశానికి  ఎంతో ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  చెప్పారు.  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను  రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  మంగళవారంనాడు  ప్రారంభించారు.   రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన  తర్వాత  పార్లమెంట్  ఉభయ సభలనుద్దేశించి  ద్రౌపది ముర్ము  తొలిసారిగా  ప్రసంగించారు. ఆత్మనిర్బర్ భారత్ ను నిర్మించుకుందామన్నారు. పేదరికం లేని భారత నిర్మాణ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. దేశ ప్రగతిలో  యువశక్తి, నారీశక్తి  భాగస్వామ్యం కావాలన్నారు.  

ప్రపంచ సమస్యలకు  భారత్ పరిష్కారం చూపిస్తుందని రాష్ట్రపతి  ధీమాను వ్యక్తం  చేశారు.  గతంలో  ప్రపంచం మీద భారత్ ఆధారపడిన విషయాన్ని ఆమె గుర్తు  చేశారు. ఇప్పుడు ప్రపంచదేశాలు  భారత్ పై ఆధారపడుతున్నాయని రాష్ట్రపతి  చెప్పారు.  భారత్ అన్ని రంగాల్లో  స్వయం సమృద్ది సాధించాలన్నారు. మహిళా సాధికారాతరకు  ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తుందని  రాస్ట్రపతి ముర్ము  చెప్పారు.దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుందని  ముర్ము  చెప్పారు.  పొరుగుదేశాలతో  సరిహద్దుల్లో  సవాళ్లను సమర్ధవంతంగా  ఎదుర్కొన్న విషయాన్ని రాష్ట్రపతి  గుర్తు  చేశారు. 

ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలను  కేంద్రం తీసుకు వచ్చిన విషయాన్ని రాష్ట్రపతి  ప్రస్తావించారు.   తొమ్మిదేళ్ల తమ ప్రభుత్వ పాలనలో  దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని  రాష్ట్రపతి చెప్పారు.  అవినీతి అంతం దిశగా  దేశం అడుగులేస్తుందన్నారు.   విధాన లోపాన్ని  వీడి  ముందడుగు వైపు దేశం సాగుతుందని  రాష్ట్రపతి  తెలిపారు.  భారత్ మునుపెన్నడూ లేనంత ఆత్మ విశ్వాసంతో ముందుకు  సాగుతుందన్నారు. 
డిజిటల్ ఇండియా దిశగా  భారత్ దూసుకు పోతుందని  రాష్ట్రపతి  చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకొని  నూతన ఆవిష్కరణలు తీసుకుస్తున్నామని  రాష్ట్రపతి తెలిపారు.  పేదల ఆలోచన స్థాయిని  కూడా పెంచుతున్నామన్నారు. 

ఫసల్ భీమా, కిసాన్ కార్డు వంటి పథకాలను  తీసుకు వచ్చి రైతుల సంక్షేమం కోసం  కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు రాష్ట్రపతి.  పంట నష్టపోయిన  రైతులను అన్ని విధాల కేంద్రం ఆదుకుంటుందని రాష్ట్రపతి చెప్పారు. కనీస మద్దతు ధర  పెంచి రైతులను  బలోపేతం  చేస్తున్నామన్నారు.   ఆదీవాసీ ప్రాంతాల్లో  ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు  చేసినట్టుగా రాష్ట్రపతి తెలిపారు.తొలిసారిగా  బిర్సాముండా జయంతి ఉత్సవాలను జరిపిన విషయాన్ని రాష్ట్రపతి  తన ప్రసంగంలో  గుర్తు  చేశారు. ఆదీవాసీల కోసం  ఎన్నో పథకాలు  ప్రవేశపెట్టి వారి అభివృద్దికి  కేంద్రం పాటుపడుతుందన్నారు.గిరిజన నేతలకు  మంచి గుర్తింపు లభిస్తున్న విషయాన్ని రాష్ట్రపతి వివరించారు.   ఓబీసీల సంక్షేమం కోసం  కేంద్రం ముందడుగు వేసిందని రాష్ట్రపతి తెకలిపారు.  బాగా వెనుకబడిన గ్రామాలకు  కేంద్ర ప్రభుత్వం అభివృద్దిలోకి తీసకువచ్చిందని   రాష్ట్రపతి  తెలిపారు.  అన్నివర్గాల  అభివృద్దికి  కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టుగా  చెప్పారు. రికార్డు  స్థాయిలో  జీఎస్టీ వసూళ్లు నమోదౌతున్నాయని  రాష్ట్రపతి తెలిపారు.    

కేంద్ర ప్రభుత్వం  స్థిరమైన, భయం లేని నిర్ణయాలు తీసుకుందని  రాష్ట్రపతి  ముర్ము  చెప్పారు.    మూడు కోట్ల మంది పేదలకు  కేంద్ర ప్రభుత్వం  పక్కా ఇళ్లు నిర్మించి  ఇచ్చిందన్నారు.  మూడేళ్లలో  11 కోట్ల మందికి  ఇంటింటికి మంచినీరు అందించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని  రాష్ట్రపతి  చెప్పారు.  దేశ ప్రజలకు కోవిడ్  నుండి విముక్తి కల్గించిన ప్రభుత్వంగా  రాష్టపతి ముర్ము తెలిపారు. నిరుపేద కోవిడ్ బాధితులకు  ప్రభుతవం అండగా నిలిచిందన్నారు రాష్ట్రపతి.  కోవిడ్ కష్టకాలంలో  ప్రభుత్వం అన్ని విధాలుగా సహయం చేసిందన్నారు.  భేటీ బచావ్ భేటీ పడావ్  అనే నినాదం మంచి ఫలితాన్ని ఇచ్చిందని రాష్ట్రపతి చెప్పారు.  దేశంలో  మహిళల సంఖ్య తొలిసారిగా  పెరిగిందని ముర్ము  చెప్పారు. సైన్యంలో  మహిళలకు కూడా అవకాశాలు కల్పించిన  విషయాన్ని రాష్ట్రపతి  ప్రస్తావించారు.  అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా  కేంద్రం  చర్యలు తీసుకుంటుందన్నారు.  ఆర్ధికంగా, సామాజికంగా మహిళలు  అభివృద్ది పథంలో సాగేలా  ప్రభుత్వం   పనిచేస్తుందని రాష్ట్రపతి తెలిపారు.  
 పీఎం ఆవాస్ యోజన పథకం  మంచి ఫలితాలను  ఇచ్చిందన్నారు.
 


 

 


 

click me!