గుజరాత్‌లో 'పఠాన్' విడుదలకు మాకు అభ్యంతరం లేదు - బజరంగ్ దళ్, వీహెచ్ పీ ప్రకటన

By team teluguFirst Published Jan 24, 2023, 5:04 PM IST
Highlights

పఠాన్ సినిమాకు స్వల్ప ఊరట లభించింది. గుజరాత్ లో విడుదల అయ్యేందుకు అన్ని అడ్డంకులను అధిగమించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాకు సవరణలు చేసింది. దీంతో సంతృప్తిగా ఉన్నామని, సినిమా విడుదలకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని బజరంగ్ దళ్, వీహెచ్ పీ ప్రకటించింది. 

వివిధ హిందూ సంస్థలు, బీజేపీ నాయకుల నుంచి భారీ ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న పఠాన్ సినిమాకు కాస్త ఉపషమనం లభించింది. గుజరాత్ లో సినిమా విడుదల చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) ప్రకటించింది. దీంతో ఈ సినిమా ఆ రాష్ట్రంలో విడుదల కానుంది.

ప్రయాణికుల మూత్ర విసర్జనతో ఎయిర్ ఇండియాకు తంటాలు.. రెండో ఘటన రిపోర్ట్ చేయలేదని రూ. 10 లక్షల ఫైన్ 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) సవరణలతో తాము సంతృప్తి చెందామని, ఇకపై సినిమాను వ్యతిరేకించబోమని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) తెలిపింది. హిందీ చిత్రం పఠాన్‌కు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ నిరసనలు వ్యక్తం చేసిన తరువాత సెన్సార్ బోర్డ్ ఈ చిత్రం నుండి అశ్లీల, అసభ్య పదాలను తొలగించిందని, ఇది శుభవార్త అని గుజరాత్ వీహెచ్ పీ నాయకుడు అశోక్ రావల్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘మతం, సంస్కృతిని రక్షించేందుకు ఈ విజయవంతమైన పోరాటం చేసిన కార్యకర్తలను, మొత్తం హిందూ సమాజాన్ని అభినందిస్తున్నాను’’ అని అన్నారు.

ఈ పఠాన్ సినిమాపై దేశంలో విస్తృతమైన నిరసనలు, ఆగ్రహాల మధ్య సీబీఎఫ్ సీ 10 కంటే ఎక్కువ చోట్ల సీన్ లను కత్తిరించింది. ఈ కత్తిరింపుల్లో వార్తల్లో నిలిచిన బేషరమ్ రంగ్ పాటలోని కొన్ని ఎక్స్ పోసింగ్ సీన్లు కూడా ఉన్నాయి. కానీ ఇందులో వివాదాస్పదమైన దీపికా పదుకొనె ధరించిన కాషాయ దుస్తులు మాత్రం అలాగే ఉండనున్నాయి.

ప్రముఖ ఆర్కిటెక్ట్, పద్మభూషణ్‌ గ్రహీత బాలకృష్ణ దోషి ఇక లేరు..

‘బేషరం రంగ్’ అనే పాటలో హీరోయిన్ కాషాయ దుస్తులు ధరించడంపై నరోత్తమ్ మిశ్రాతో పాటు పలువురు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఇది ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తుల మనోభావాలను కించపరిచే ప్రయత్నమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం గుజరాత్‌లోని సూరత్ లో ఉన్న ఓ సినిమా థియేటర్‌లోకి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కార్యకర్తలు దాడి చేసి సినిమా పోస్టర్లను చించివేశారు. అయితే ఈ ఘటనలో అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐదుగురు కార్యకర్తలను అరెస్టు చేశారు.

ఈ నిరసనల నేపథ్యంలో ఇటీవల గుజరాత్‌లోని మల్టీప్లెక్స్ యజమానులు హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవిని కలిశారు. నిరసనలు, విధ్వంసాలు, సంఘ వ్యతిరేక వ్యక్తుల నుంచి థియేటర్‌లకు పోలీసు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని పూణేలో కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు సోమవారం నిరసనలు చేపట్టారు. శివజీనగర్‌లోని రాహుల్ సినిమా థియేటర్ వద్ద అభిమానులు ఉంచిన పఠాన్ పోస్టర్‌ ను తొలగించారు. . గత శుక్రవారం గౌహతిలోని గోల్డ్ డిజిటల్ సినిమా హాల్ ముందు బజరంగ్ దళ్ కార్యకర్తలు గుమిగూడారు. అక్కడ పఠాన్ పోస్టర్లను ధ్వంసం చేసి, తగులబెట్టారు. జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు.

భాయ్ ఫ్రెండ్ ఉంటేనే క్యాంపస్ లోకి ఎంట్రీ.. ఒడిశా కాలేజీ వింత ప్రకటన.. సోషల్ మీడియాలో నోటీస్ వైరల్

వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ఈ పఠాన్ సినిమా జనవరి 25వ తేదీన విడుదల కానుంది. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత తెరపైకి వస్తున్న షారుక్ ఖాన్ సినిమా ఇది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రముఖ పాత్రల్లో నటించారు. జనవరి 25వ తేదీ కోసం ముందస్తుగా 4.19 లక్షల టిక్కెట్లను విక్రయించగా.. అందులో దాదాపు 4.10 లక్షల అమ్మకాలు జరిగాయి. కాగా.. ఇలా 6.50 లక్షల టిక్కెట్‌ విక్రయాలతో ప్రభాస్‌ నటించిన బాహుబలి 2 ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. అయితే పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

click me!