ప్రయాణికుల మూత్ర విసర్జనతో ఎయిర్ ఇండియాకు తంటాలు.. రెండో ఘటన రిపోర్ట్ చేయలేదని రూ. 10 లక్షల ఫైన్

By Mahesh KFirst Published Jan 24, 2023, 4:41 PM IST
Highlights

ఎయిర్ ఇండియా విమానంలో రెండో సారి మూత్ర విసర్జన చేసిన ఘటన జరిగింది. గతేడాది డిసెంబర్ 6వ తేదీన ఓ వ్యక్తి  తోటి మహిళా ప్యాసింజర్ సీటు పై ఉన్న బ్లాంకెట్‌లో మూత్రం పోసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో డీజీసీఏ ఎయిర్ ఇండియాను వివరణ అడిగింది. ఘటన పై రిపోర్ట్ చేయకుండా నిబంధన ఉల్లంఘించిందని రూ. 10 లక్షల జరిమానా విధించింది. 
 

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ ప్రయాణికుడు గతేడాది నవంబర్ 26న ఓ మహిళా సహ ప్రయాణికురాలి సీటుపై మూత్రం పోశాడన్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఘటన పోలీసులు, కేసులు, కోర్టు వరకూ వెళ్లింది. ఇలాంటిదే మరో ఘటన డిసెంబర్‌ 6వ తేదీన అదే విమానయాన సంస్థలో చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనను ఎయిర్ ఇండియా వెంటనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు రిపోర్ట్ చేయలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిందని రూ. 10 లక్షల జరిమానాను ఎయిర్ ఇండియాపై డీజీసీఏ విధించింది. టాటా సంస్థ నిర్వహణలోని ఎయిర్ ఇండియా విమానంలో డిసెంబర్ 6వ తేదీన జరిగిన మూత్ర విసర్జన ఘటనను తమ ఇంటర్నల్ కమిటీకి రిపోర్ట్ చేయలేదని డీజీసీఏ పేర్కొంది.

అయితే, ఈ ఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాల నేపథ్యంలోనే డీజీసీఏ ఎయిర్ ఇండియాకు ప్రశ్నలు వేసింది. రెండో ఘటనకు సంబంధించిన వివరాలు అందించాలని డీజీసీఏ ఈ నెల 5వ తేదీన నోటీసులు పంపింది. అప్పటి వరకు ఎయిర్ ఇండియా డీజీసీఏకు ఈ ఘటన వివరాలు అందించలేదని తెలిపింది. ఈ నోటీసులకు ఎయిర్ ఇండియా సమాధానం ఇచ్చిందని వివరించింది. అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులకు సంబంధించిన డీజీసీఏ నిబంధనలను పాటించలేదని ఎయిర్ ఇండియా సమాధానమే తమకు అర్థం అవుతుందని తెలిపింది. డిసెంబర్ 6వ తేదీన ఓ ప్యారిస్ నుంచి ఢిల్లీకీ ఎయిర్ ఇండియా విమానంలో వస్తున్న ఓ ప్రయాణికుడు తోటి మహిళా వేకెంట్‌ సీటు మూత్రం పోశారు. ఆ సీటు ఖాళీగా ఉన్న సమయంలో బ్లాంకెట్ పై మూత్ర విసర్జన చేసినట్టు కథనాలు తెలిపాయి.

Also Read: ఆ మహిళా ప్రయాణికురాలిపై నేను మూత్రం పోయలేదు.. ఆమెనే విసర్జించుకుంది.. ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో ఘటనపై నిందితుడు

న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో జరిగిన షాకింగ్ ఘటన మరవకముందే ఇలాంటిదే మరో ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. పది రోజుల తర్వాత.. ప్యారిస్-ఢిల్లీ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై తాగిన మగ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. అయితే.. నిందితుడు వ్రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. దీంతో నిందితుడుపై ఎలాంటి బలవంతపు చర్య తీసుకోలేదని అధికారులు గురువారం తెలిపారు. ఈ ఘటన డిసెంబరు 6న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 142లో జరిగింది. విమానం పైలట్ ఈ విషయాన్ని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించాడు.

click me!