Sonali Phogat: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా మారాలని అనుకోవట్లేదు: సోనాలి ఫోగట్ కుటుంబం

By Mahesh KFirst Published Aug 27, 2022, 3:25 PM IST
Highlights

బీజేపీ నేత సోనాలి ఫోగట్ మర్డర్ కేసు.. సుశాంత్ సింగ్  రాజ్‌పుత్ డెత్ కేసులో మారాలని అనుకోవడం లేదని, ఈ కేసు డ్రగ్స్ గురించి కాదని, ఒక మర్డర్ గురించి అని సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు అన్నారు. సోనాలి ఫోగట్ హంతకులను ఉరి తీయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు వివరించారు.

న్యూఢిల్లీ: బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడవుతున్న తరుణంలో ఆమె కుటుంబ సభ్యులు ఆవేదనతో కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు తరహాలో ఈ కేసు మారకూడదని అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం ఇప్పటికీ అది హత్యే అని నమ్ముతున్నదని వివరించారు. రియా చక్రవర్తి స్వయంగా ఆయనకు డ్రగ్స్ ఇచ్చినట్టు ఇప్పటికీ వారు అనుమానిస్తుననారని తెలిపారు. కానీ, ఆమె ప్రస్తుతం బయట ఉన్నారని చెప్పారు. ఆ కేసు ఇంకా కొలిక్కి చేరలేదని వివరించారు. సోనాలి ఫోగట్ కేసు డ్రగ్స్ గురించి కాదని పేర్కొన్నారు. డ్రగ్స్ మెయింటెయిన్ చేశారనో.. లేక డ్రగ్స్ సేవించారో అనే దాని గురించి కాదని తెలిపారు. కానీ, హత్య గురించి మాత్రమే ఈ కేసు అని స్పష్టం చేశారు.

సోనాలి ఫోగట్ హంతకులను ఉరి తీయాలని తాము డిమాండ్ చేస్తున్నామని వివరించారు. సోనాలి ఫోగట్ హత్యకు గురైందని నిరూపణ కాకుంటే.. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతామని తెలిపారు. అంతేకాదు, అవసరమైతే నార్కో టెస్టు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.

సోనాలి ఫోగట్ మృతదేహానికి కుటుంబ సభ్యుల సమ్మతితో గురువారం పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె డెడ్ బాడీపై గాయాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత గోవా పోలీసులు మర్డర్ కేసు పెట్టారు. 

ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత శుక్రవారం ఇద్దరు వ్యక్తులను ఈ మర్డర్ కేసులో అరెస్టు చేశారు. ఇందులో క్లబ్ ఓనర్, ఒక డ్రగ్ పెడ్లర్ ఉన్నారు. అంతేకాదు, క్లబ్ వాష్ రూమ్ నుంచి డ్రగ్స్ కూడా పోలీసులు రికవరీ చేసుకున్నారు. అదే విధంగా సోనాలి ఫోగట్ ఇద్దరు అనుచరులు సుధీర్ సాంగ్వన్, సుఖ్వింద్ వాసిలను ఈ మర్డర్ కేసులో ముందుగానే అరెస్టు చేశారు.

అంతకు ముందు సోనాలి ఫోగట్ డ్రగ్స్ తీసుకున్నదని గోవా పోలీసులు పేర్కొన్నారు. ఓ సీసీటీవ ఫుటేజీలో బీజేపీ నేత సోనాలి ఫోగట్ పబ్‌లో తడబడుతూ నడుస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

click me!