కృష్ణా జలాల వాటాలో నిక్క‌చ్చిగా ఉంటుంన్నాం - మంత్రి జగదీష్ రెడ్డి.. సాగ‌ర్ ఎడమ కాలువ నీటి విడుద‌ల

Published : Jul 28, 2022, 11:24 AM IST
కృష్ణా జలాల వాటాలో నిక్క‌చ్చిగా ఉంటుంన్నాం - మంత్రి జగదీష్ రెడ్డి.. సాగ‌ర్ ఎడమ కాలువ నీటి విడుద‌ల

సారాంశం

సాగర్ ఎడమ కాలువ ద్వారా మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం నీటిని విడుదల చేశారు. దాని కంటే ముందు ప్రత్యేక పూజలు చేశారు. నీటిని విడుదల చేయడం వల్ల ఆయకట్టు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. 

కృష్ణా జలాల వాటాలో తెలంగాణ ప్ర‌భుత్వం నిక్క‌చ్చిగా వ్య‌వ‌హరిస్తోంద‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌క‌ట్టు రైతాంగానికి స‌కాలంలో నీరు అందుతోంద‌ని అన్నారు. గురువారం ఉద‌యం ఆయ‌న నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ నీటిని విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. 

పెద్దపల్లిలో అమానుషం... ఆస్తి కోసం తాతను కొట్టిచంపిన మనవళ్ళు, అమ్మమ్మ పరిస్థితి విషమం

ఎడమ కాలువ ద్వారా జూలై స‌మయంలో నీటిని విడుద‌ల చేయ‌డం రెండు ద‌శాబ్దాల కాలంలో ఇదో రెండో సారి అని అన్నారు. కాగా ప్ర‌త్యేక తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఇదే మొద‌టి సారి అని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 6.50 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు ర‌చించామ‌ని అన్నారు. ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగు అందిస్తామ‌ని అన్నారు. అలాగే నల్లగొండ జిల్లాలో 1.45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,41,000 వేల ఎకరాలు (ఎత్తిపోతల తో కలుపుకొని) అందిస్తామ‌ని అన్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్దికి బుజ్జగింపులు: దిగ్విజయ్ ఫోన్, ఢిల్లీ రావాలని సూచన

టీఎంసీల వారీగా చూస్తే నల్లగొండ జిల్లాకు 18 టీఎంసీలు, సూర్యాపేట జిల్లాకు 18 టీఎంసీలు, ఖ‌మ్మం జిల్లాకు 29 టీఎంసీలు వ‌స్తుంద‌ని చెప్పారు. సాగర్ జలాశయానికి గ‌తేడాది పోలిస్తే నీరు మ‌రింత అద‌నంగా వ‌చ్చి చేరుతోంద‌ని అన్నారు. దీంతో ఆయ‌క‌ట్టు రైతులు సంబురాలు చేసుకుంటున్నార‌ని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !