Tamil Nadu: మేం హిందీకి వ్యతిరేకం కాదు, హిందీ విధింపును వ్యతిరేకిస్తున్నాం: స్టాలిన్

By Mahesh RajamoniFirst Published Jan 26, 2022, 11:22 AM IST
Highlights

Tamil Nadu: త‌మిళ‌నాడులో హిందీ భాష ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దాల‌ని చూసిన‌ప్పుడు త‌మిళ స‌మాజం భ‌గ్గుమంది.  ఈ నేపథ్యంలోనే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే.స్టాలిన్ మాట్లాడుతూ.. మేము హిందీకి వ్య‌తిరేకం కాద‌నీ, హిందీ విధింపును వ్య‌తిరేకిస్తున్నామ‌ని అన్నారు. 
 

Tamil Nadu: త‌మిళ‌నాడులో హిందీ భాష ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దాల‌ని చూసిన‌ప్పుడు త‌మిళ స‌మాజాం భ‌గ్గుమంది. తాజాగా దీనిపై డీఎంకే అధ్య‌క్షుడు, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే.స్టాలిన్ (Tamil Nadu Chief Minister MK Stalin) మాట్లాడుతూ.. మేము హిందీకి వ్య‌తిరేకం కాద‌నీ, హిందీ విధింపును వ్య‌తిరేకిస్తున్నామ‌ని అన్నారు.  హిందీ విధింపుపై నిరసనల పరంపర నుండి పుట్టిన మంటలు చల్లారబోవని తెలిపారు. హిందీ సహా ఏ భాషకైనా త‌మిళ‌నాడు వ్యతిరేకం కాదని అన్నారు. కానీ హిందీని త‌మిళ‌నాడుపై బ‌ల‌వంతంగా రుద్దాల‌నే విధింపును వ్య‌తిరేకిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌మిళులు త‌మ మాతృభాష‌, సంస్కృతిని నిపుపుకోవ‌డానికి చేస్తున్న కృషి నేప‌థ్యంలో దాని స్థానంలో ఇత‌ర భాష‌ల తీసుకురావ‌ల‌నే ప్ర‌య‌త్నాలు నిరాక‌రిస్తే దానిని సంకుచిత మనస్తత్వంగా భావించరాదని ఆయన అన్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం, అనంతర కాలంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో భాషా అమరవీరుల త్యాగాలను స్మరించుకునేందుకు డీఎంకే యువజన విభాగం నిర్వహించిన వర్చువల్ మీట్‌లో స్టాలిన్ మాట్లాడుతూ పెరియార్ రామస్వామి రగిలించిన భాషా పోరాటం ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న‌ద‌ని అన్నారు. 1965లో హిందీ వ్యతిరేక ఆందోళనలు రాష్ట్రంలో పెద్ద రాజకీయ మార్పులకు దారితీశాయ‌నీ, ఈ క్ర‌మంలోనే 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చింద‌ని తెలిపారు.  “తమిళులకు ఏ భాషపైనా ద్వేషం లేదు. ఒక భాష నేర్చుకోవడం అనేది వ్యక్తి  ప్రత్యేక హక్కుగా వదిలివేయాలి. ఇతరులపై రుద్దడం ద్వారా ఫలానా భాష పట్ల అసహ్యం సృష్టించకూడదు” అని స్టాలిన్ అన్నారు.  గాంధీ మండపం వద్ద తమిళ భాషా అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన  సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. “హిందీని (ఇతరులపై) మోపాలని భావించేవారు దానిని ఆధిపత్యం కోసం ఒక సాధనంగా మాత్రమే చూస్తారు. దేశం కోసం ఒకే మతాన్ని కోరుకున్నట్లే, దేశానికి ఒకే భాష కావాలి. హిందీ భాషపై ఒత్తిడి తేవడం ద్వారా హిందీ మాట్లాడే వారికి అన్ని విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని చూస్తున్నారు’’ అని ఆయన (Tamil Nadu Chief Minister MK Stalin) ఆరోపించారు.

ఒకే భాషా విధానంపై కేంద్ర ప్రభుత్వంపై  తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు స్టాలిన్‌. “హిందీని విధించే తన ఎజెండాను అనుసరించడం ద్వారా దేశంలోని మిగతా వారందరినీ ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని”  ఆరోపించారు. "మేము హిందీని వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే వారు మా మాతృభాషను స్థానభ్రంశం చేయాలనుకుంటున్నారు" అని ఆయన వివరించారు. ఇదిలావుండ‌గా, హిందీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు (madras high court) .. తమిళనాడు ప్రభుత్వంపై (tamilnadu govt) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అసలు హిందీతో మీకు వచ్చే నష్టమేమిటి?’’ అంటూ ధర్మాసనం నిలదీసింది. రాష్ట్రంలోని చాలా మంది యువతకి హిందీ (hindi) రాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అమలు చేయాల్సిందిగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా మంగళవారం మద్రాస్ హైకోర్ట్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 
 

click me!