
ముంబైలో గణతంత్ర దినోత్సవం రోజున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు (sports complex) టిప్పు సుల్తాన్ (tippu sulthan) పేరు పెట్టడం వివాదానికి దారి తీసింది. దీంతో బీజేపీ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ లీడర్, ముంబై ఇన్ ఛార్జ్ మినిస్టర్ అస్లాం షేక్ (aslam shaik) తన నియోజవర్గంలో ఓ పార్క్ ను ప్రారంభించాడు. ఇందులోని స్పోర్ట్స్ కాంప్లెక్ కు 18వ శతాబ్దానికి చెందిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ పేరు పెట్టారు. ఇది వివాదం అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ (bathiya janatha party - bjp) నాయకులు అక్కడికి చేరుకొని ధర్నా చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అతుల్ భత్ఖల్కర్ (mla atul bhatkhalkar) ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లో (bruhan mumbai muncipal corporation) తాము అధికారంలోకి వస్తే దానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ (chatrapathi shivaji maharaj) పేరు పెడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘శివసేన చెప్పే హిందుత్వం బోగస్ అని అన్నారు. మలాడ్ (malad) మైదానానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టడమే వారి హిందుత్వ విధానాన్ని తెలియజేస్తుంది. మేము దీనిని వ్యతిరేకిస్తున్నాం. BMC లో అధికారంలోకి వస్తే ఈ మైదానానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెడుతామని హామీ ఇస్తున్నాం’’ అని అన్నారు. 1993 బాంబే పేలుళ్లలో దోషిగా తేలిన ఉగ్రవాది యాకూబ్ మెమన్ (yakub meman)కు మద్దతుగా లేఖ రాసిన వ్యక్తి అస్లాం షేక్ అని ఆయన ఆరోపించారు. ‘‘ శివసేన కొత్త విధానం ఏంటో ముంబయి ప్రజలకు ఇప్పుడు బాగా తెలుసు. వారు అధికారంలో ఉండడానికే అలా చేస్తున్నారు. ఉగ్రవాది యాకూబ్ మెమన్‌కు మద్దతుగా లేఖ రాసిన వ్యక్తి అస్లాం షేక్ ’’ అని అన్నారు.
కాగా, ముంబైలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే సోర్ట్స్ కాంప్లెక్స్‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి శ్రీరాజ్ నాయర్ (sriraj nayar) అన్నారు. ‘‘ ఖచ్చితంగా మన ముంబై శాంతిని చెడగొట్టాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశారు. మన మహారాష్ట్ర ఒక సంత్ భూమి. హిందూ వ్యతిరేకతతోనే ఈ ప్రాజెక్టుకు ఇలా పేరు పెట్టారు ’’ అని ఆయన ట్వీట్ (tweet) చేశారు.
ఈ వివాదం పట్ల అస్లాం షేక్ స్పందించారు.. గతంలో కూడా పార్క్ లకు, రోడ్లకు టిప్పు సుల్తాన్ పేరు పెట్టినట్టు గుర్తు చేశారు. కావాలనే ఈ విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోంది అని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగాయి. అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ ఒక ధైర్యవంతుడు అని కొనియాడారు. ఏదైనా ప్రదేశానికి ఆయన పేరు పెడితే తప్పేంటని అన్నారు. తాము రాజకీయాలు చేయబోమని, అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన (shiva sena), కాంగ్రెస్ (congress), ఎన్ సీపీ (NCP)లు సంకీర్ణంగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ప్రతిపక్షంలో బీజేపీ ఉంది.