
న్యూఢిల్లీ: Republic Day ను పురస్కరించుకొని Rajpathలో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి Ramnath Kovind బుధవారం నాడు ఆవిష్కరించారు. కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ పేరేడ్ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన అతిథుల మధ్య భౌతిక దూరం పాటించేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. భారత సైనిక సామర్ధ్యం చాటి చెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. రాజ్‌పథ్ లో యుద్ద ట్యాంకులను ప్రదర్శించారు. 75 విమానాలతో వాయుసేన విన్యాసాలను నిర్వహించింది. రఫుల్, సుఖోయ్, జగ్వార్ , అపాచీ యుద్ద విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇవాళ 73వ గణతంత్రి దినోత్సవాన్ని భారత్ జరుపుకొంటుంది. రిపబ్లిక్ డే పరేడ్ భారతదేశం యొక్క సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతుంది.
అంతకుముందు విశిష్ట సేవలందించిన వారికి పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్ ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఏఎస్ఐ బాబురామ్ కు ఆశోక్ చక్రను రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన కుటుంబ సభ్యులు స్వీకరించారు.
పొగమంచు వాతావరణం మధ్య ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. Netaji సుభాష్ చంద్రబోస్ 125 జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆదివారం నాడు హోలో గ్రామ్ విగ్రహన్ని ప్రధాని Narendra Modi ఆవిష్కరించడంతో రిపబ్లిక్ డే ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ సాయుధ దళాల సిబ్బంది, ఇతరులకు 384 అవార్డులను అందించారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులు ఇవ్వడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. నలుగురికి పద్మ విభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని రాజ్‌పథ్ లో నిర్వహించిన పరేడ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 480 మందికి పైగా నృత్యకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అంతేకాదు పలు రాష్ట్రాలతో పాటు పలు ప్రభుత్వ రంగాలకు చెందిన 21 tableuaux పరేడ్ లో చోటు దక్కించుకొన్నాయి.
రాజ్‌పథ్‌లో సైనిక పరేడ్ ఆకట్టుకుంది. 16 కవాతు విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సిబ్బంది మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు.