వాటర్ ట్యాంక్‌ను ఢీకొన్న విమానం... 100 మందికి పైగా ప్రయాణికులు

By Arun Kumar PFirst Published Nov 1, 2018, 5:34 PM IST
Highlights

ఇటీవలే ఇండోనేషియాలో విమాన ప్రమాదం జరిగి 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలా తరచూ జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనుకు గురిచేస్తున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా అందులో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజా అలాంటి  ప్రమాదం నుండే ఓ ప్రయాణికుల విమానం తృటిలో తప్పించుకుంది. ఈ ప్రమాద సమయంలో 100మందికి పైగా ప్రయానికులు విమానంలో ఉన్నారు. ప్రయాణికులందరు సురక్షితంగా బైటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకుంది. ఖతార్ ఎయిర్‌వేస్ కు చెందిన క్యూఆర్ 540 విమానం దోహా నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి బయలుదేరింది. ఈ విమానంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు వున్నారు. అయితే కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యింది.

విమానం కిందికి దిగే క్రమంలో విమానాశ్రయంలోని  ఓ వాటర్ ట్యాంకర్ ని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో మంటలేవీ  చెలరేగకపోవడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగినప్పటికి విమానం సేఫ్ గానే ల్యాండైనట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో విమానం మధ్యభాగం దెబ్బతినగా... ప్రయాణికులు, సిబ్బందిని క్షేమంగా బైటపడ్డారు.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులను విమానం నుండి బైటకు తీసువచ్చారు. అనంతరం దెబ్బతిన్న విమానాన్ని కార్గో ఏరియాకి తీసుకెళ్లి ఇంజనీర్ల సమక్షంలో మరమ్మతులు చేపట్టారు.   

మరిన్ని వార్తలు

ఇండోనేషియా విమాన ప్రమాదం.. అదంతా తప్పుడు వార్త

విమాన ప్రమాదం తప్పించుకున్న టిడిపి నేతలు

click me!