నన్ పై రేప్ .. కేసు వెనక్కి తీసుకోవడానికి రూ.5కోట్లు ఆఫర్

By ramya neerukondaFirst Published 12, Sep 2018, 12:12 PM IST
Highlights

 ప్రాంకో ములక్కల్ కేథలిక్ బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని క్రైస్తవ సన్యాసిని(నన్) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తన సోదరి పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటే రూ.5కోట్లు ఇస్తామని తమకు లంచం ఆఫర్ చేశారని నన్ సోదరుడు తెలిపారు. కేరళ రాష్ట్రంలోని జలంధర్ డయాసిస్ కు చెందిన ప్రాంకో ములక్కల్ కేథలిక్ బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని క్రైస్తవ సన్యాసిని(నన్) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసు విచారణలో భాగంగా ఆమె సోదరుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

కేసు వెనక్కి తీసుకోవాలంటూ తమపై ఒత్తిడి చేపడుతున్నారని నన్ సోదరుడు ఆరోపించారు.  నిందితుడు ప్రాంకో ములక్కల్ బంధువు, మరో ఇద్దరు పాస్టర్లు వచ్చి తనను కలిసి ఈ ఆఫర్ తెలిపినట్లు ఆయన వివరించారు. 

ఈ కేసు విషయంలో ఇప్పటికే పోలీసులు ప్రాంకో ములక్కల్ కి నోటీసులు జారీ చేశారు. కాగా.. రేపు ఈ కేసు కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కేసు కోర్టు దాకా రాకముందే వివాదాన్ని సద్దుమణిగించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST