11 సంవత్సరాలు సర్వీస్.. స్నిఫర్ డాగ్ కి ఘనంగా వీడ్కోలు

Published : Feb 27, 2021, 11:23 AM ISTUpdated : Feb 27, 2021, 11:37 AM IST
11 సంవత్సరాలు సర్వీస్.. స్నిఫర్ డాగ్ కి ఘనంగా వీడ్కోలు

సారాంశం

కుక్క పోలీసు శాఖలో దాదాపు 11 సంవత్సరాల పాటు ఉత్తమ సేవలు అందించింది. కాగా..  దానికి ఘనంగా వీడ్కోలు పలికారు.

పోలీసు శాఖలో స్నిఫర్ డాగ్ లు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ విషయం మనకు తెలిసిందే. పోలీసులకు దొంగలను పట్టుకోవడంలో సహాయం చేయడంతోపాటు... బాంబులను పసిగట్టడం లాంటి చాలా కీలకమైన పనులు ఈ కుక్కలు నిర్వహిస్తాయి. కాగా... ఓ కుక్క పోలీసు శాఖలో దాదాపు 11 సంవత్సరాల పాటు ఉత్తమ సేవలు అందించింది. కాగా..  దానికి ఘనంగా వీడ్కోలు పలికారు.

11 ఏండ్ల పాటు నిర్విరామంగా సేవ‌లందించిన ఆ స్నిఫ‌ర్ డాగ్‌కు మ‌హారాష్ర్ట నాసిక్ పోలీసులు ఫిబ్ర‌వ‌రి 24న‌ ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. పోలీసు వాహ‌నం బొనెట్‌పై బెలూన్స్‌, గులాబీ పూల‌తో డెక‌రేట్ చేశారు. బెలూన్స్ మ‌ధ్య స్నిఫ‌ర్ డాగ్‌ను కూర్చోబెట్టి.. పూల‌మాల‌తో స‌త్క‌రించి వీడ్కోలు చెప్పారు. 

ఈ శున‌కం 11 ఏండ్ల విధి నిర్వ‌హ‌ణ‌లో ఎన్నో బాంబుల‌ను గుర్తించి శ‌భాష్ అనిపించుకుంది. భ‌ద్ర‌తా ప‌ర‌మైన విధుల్లో చురుకుగా పాల్గొని, పోలీసుల‌కు ఎంతో మేలు చేసింద‌ని పోలీసు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

IRCTC 5 Jyotirlinga Yatra: ఒకే ఒక్క టికెట్‌తో 5 జ్యోతిర్లింగాలు చూసే ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ !
Kamakhya Devi Temple: ఈ ఆలయంలో నెలసరిని పండగలా చేస్తారు ఎక్కడో తెలుసా? | Asianet News Telugu