స్నేహితుడి తల్లిపై కన్నేసిన దుర్మార్గుడు.. చివరకు..

Published : Feb 27, 2021, 08:34 AM ISTUpdated : Feb 27, 2021, 08:37 AM IST
స్నేహితుడి తల్లిపై కన్నేసిన దుర్మార్గుడు.. చివరకు..

సారాంశం

తమ పొలంలో వరికోసే యంత్రాన్ని చూసి వద్దామని తోడు రావాలంటూ స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అయితే.. తన కొడుకు లేడని.. తాను వస్తానని మహిళ పేర్కొంది.

తల్లి లాంటి స్నేహితుడి కన్న తల్లిపై ఓ దుర్మార్గుడు కన్నేశాడు.  సమయం చూసుకొని ఎవరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో.. బండరాయితో మోది హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఛత్తీస్ గఢ్ లోని మహాసముండ్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... బాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 20ఏళ్ల చింతామణి పటేల్ అలియాస్ చింటూ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ స్నేహితుడు ఉన్నాడు.

బుధవారం అర్థరాత్రి దాటాక స్నేహితుడి ఇంటికి వెళ్లిన బాధితుడు.. తమ పొలంలో వరికోసే యంత్రాన్ని చూసి వద్దామని తోడు రావాలంటూ స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అయితే.. తన కొడుకు లేడని.. తాను వస్తానని మహిళ పేర్కొంది.

దీన్ని అవకాశంగా మరల్చుకున్న నిందితుడు పొలం నుంచి తిరిగి వచ్చే సమయంలో స్నేహితుడి తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో అక్కడే ఉన్న బండరాయిని తలపై మోది అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మహిళ కేకలు విన్న కొంతమంది గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

White Animals: ఇండియాలో అరుదైన తెల్లటి అడవి జంతువులు కనిపించే 8 అద్భుతమైన ప్రదేశాలు ఇవే !
హర్యానా బహిరంగ సభలో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Modi Powerful Speech from Jind, Haryana