
ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పత్రిక సామ్నా తన కొత్త సంపాదకీయం ప్రతిపక్షాలు, అధికార బీజేపీని వింతగా పోల్చింది. వాగ్నర్ గ్రూపును భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తూ ‘‘ప్రజాస్వామ్య రక్షకుడు’’ అని అభివర్ణించింది. పుతిన్ కు వ్యతిరేకంగా వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తిరుగుబాటు చేసినట్లే, ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరేందుకు ప్రతిపక్షాలు పాట్నాలో ఏకమయ్యాయని పేర్కొంది.
ఎన్నికల్లో విజయం సాధించడానికి, ఓటర్లపై ఒత్తిడి తీసుకురావడానికి మోడీ-షా పెద్ద సంఖ్యలో కిరాయి దళాలను సిద్ధం చేశారని శివసేన అధికార పత్రిక పేర్కొంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం రష్యాలో కనిపిస్తోందని తెలిపింది. పుతిన్ మాదిరిగానే మోదీ-షాలు కూడా నియంతృత్వాన్ని, నిరంకుశత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
దారుణం.. చేతబడి చేసిందనే నెపంతో వృద్ధురాలిని కొట్టి చంపిన గ్రామస్తులు..
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. మోడీ అనుచిత ఆంగ్లంలో మాట్లాడటం ద్వారా తనను తాను అపహాస్యం చేసుకున్నారని తెలిపింది. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మైనారిటీలపై దాడిపై విలేకరుల అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ కాళ్ల కింద నుంచి భూమి జారిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది.
గంటల తరబడి నిరీక్షించినా స్టాప్ లో ఆగడం లేదని.. బస్సు కిటికీని రాయితో పగులగొట్టిన మహిళ..
కాగా.. శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ కూడా మహారాష్ట్రలో పరిస్థితిని వివరించడానికి వాగర్ గ్రూప్ పోలికను ఉపయోగించారు. బీజేపీ, శివసేన (షిండే వర్గం) మధ్య పొత్తును ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఆయన మంత్రులు రష్యాలో అద్దె సైన్యం - వాగ్నర్ గ్రూపును పోలి ఉన్నారని ఆయన అన్నారు. ‘‘త్వరలోనే మీపై (బీజేపీ) కూడా ఎదురుదాడికి దిగుతారు. అవి ఎవరికీ చెందినవి కావు’’ అని అన్నారు.